వరుస పేలుళ్లతో దద్దరిల్లిన పంజాబ్‌…

వరుస పేలుళ్లతో దద్దరిల్లిన పంజాబ్‌

Advertisements

<p>వరుస పేలుళ్లతో పంజాబ్‌ దద్దరిల్లింది&period; రెండు గంటల్లో 2 చోట్ల పేలుళ్లు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది&period; రాత్రి జలంధర్‌లోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ BSF ప్రధాన కార్యాలయం సమీపంలో పేలుడు జరిగింది&period; కార్యాలయం బయట పార్క్‌ చేసి ఉన్న యాక్టివ్‌ పేలడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి&period; ఈ ఘటనలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి&period; కిలోమీటరు వరకు పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు&period; ఈ పేలుడులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే దానిపైనా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే అమృత్‌సర్‌లో మరో పేలుడు జరిగింది&period; అటారీ రోడ్డులోని ఆర్మీ ఖాసా కంటోన్మెంట్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది&period; ఆ ప్రాంతంలో రేకును పోలిన శకలాలు దొరికాయని&period;&period;దీంతో ఎవరో పేలుడు పరికరాన్ని విసరడం వల్లే ఈ పేలుడు జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు&period; గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి&comma; దాడి చేసి&comma; ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది&period; ఈ రెండు ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు&period; ఈ రెండు ఘటనలూ ఆర్మీ యూనిట్‌లకు సమీపంలోనే జరగడం మరింత ఆందోళనలను రేకెత్తిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..