57
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రామగుండం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో 1,51,865 ఓట్లు పోలవగా మక్కాన్ సింగ్ కు 91,432 ఓట్లు రాగా అతని సమీప అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే కోరు కంటి .చందర్ కు 35,080 ఓట్లు వచ్చాయి. గత మూడు పర్యాయాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మక్కా న్ సింగ్ ఎట్టకేలకు విజయం సాధించారు. రామగుండంలో అరాచక పాలనకు ప్రజలు ఓటు ద్వారా తీర్పు చెప్పారని అన్నారు. బి అర్ ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని తాము రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఉన్నత స్థానంలో నిలబెడతామని హామీ ఇచ్చారు. బైట్. రాజ్ ఠాకూర్ మక్కా న్ సింగ్, ఎమ్మెల్యే, రామగుండం