సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల నిధుల రికవరీ కలకలం సృష్టిస్తుంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో మేళ్లచెరువు గ్రామపంచాయతీలో సుమారు రెండు కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని జిల్లా అధికారులు గుర్తించారు. రికవరీ చేయాలంటూ గ్రామ సర్పంచ్ పందిల్లపల్లి శంకర్ రెడ్డికి నోటీసులు అందించారు. RR యాక్ట్ కింద 45 రోజుల్లో నిధులను రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ మేళ్లచెరువు తాసిల్దార్ కి ఉత్తర్వులు జారీ చేశారు. మేళ్లచెరువు గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఇటీవల కొందరు వార్డు సభ్యులు, స్థానికులు ఫిర్యాదు చేయడంతో కోదాడ ఆర్డీవో సత్యనారాయణ రికార్డులు స్వాధీన పరుచుకున్నారు. అనంతరం విచారణ చేయగా సాధారణంగా గ్రామపంచాయతీ నిధులు 92లక్షల 66వేల రూపాయలతో పాటు ఆర్థిక సంఘ నిధులు 63లక్షల 30వేల 21 రూపాయలు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు 43లక్షల 16వేల 86 రూపాయలు మొత్తం కలిపి కోటి 99 లక్షల 12 వేల 112 రూపాయలు దుర్వినియోగం అయినట్లు ఆర్డీవో తేల్చి చెప్పారు. ఈ నివేదిక జిల్లా కలెక్టర్ సమర్పించగా ఈవోని సస్పెండ్ చేశారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామపంచాయతీ సర్పంచ్ అయిన శంకర్ రెడ్డిని సంజాయిషీ కోరుతూ ఈనెల 16న షోకాజ్ నోటీసులు అందించారు. అయితే ఈ నోటీసులకి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో గ్రామపంచాయతీ నిధులను అక్రమంగా దుర్వినియోగంగా డ్రా చేశారని, ఆ డబ్బు మొత్తాన్ని రెవెన్యూ రికవరీల చట్టం ప్రకారం 45 రోజుల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ నుండి రికవరీ చేసి గ్రామ పంచాయితీ ఖాతాలో జమ చేయాలని మేళ్లచెరువు తాసిల్దార్ కి కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు.
గ్రామ పంచాయతీ నిధుల రికవరీ కలకలం
162
previous post