66
ఖతార్ లో మరణశిక్ష పడిన 8 మంది భారతీయులకు ఊరట లభించింది. 8 మంది నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గిస్తూ ఖతార్ కోర్టు తీర్పు వెలువరించింది. 8 మంది నేవీ మాజీ అధికారులపై గూఢచర్యం ఆరోపణలు వచ్చాయి. ప్రైవేటు భద్రతా సంస్థ అల్ దహ్రాలో వీరంతా పని చేశారు. కేసు నమోదవడంతో గతేడాది 8 మంది భారతీయులను ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు తీర్పుతో వారి కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.