డాక్టర్ గణేష్ కి రేపల్లె వైసీపీ టికెట్…

Repalle YCP ticket for Dr. Ganesh...

Advertisements

&NewLine;<p>ఈసారి ఎలాగైనా టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ను ఓడించేందుకు నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగారు&period; రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణకు నియోజకవర్గంలో మంచి పేరు ఉన్నప్పటికీ గౌడ సామాజిక వర్గానికి దగ్గర కాలేకపోయారు&period; దీంతో రెండుసార్లు వైసిపి ఓటమి పాలు కావాల్సి వచ్చింది&period; ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టు ప్రత్యర్థిని&period; రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన నేతనే జగన్ ఎంచుకున్నారు&period; దీనిలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో అప్పటి కూచినపూడి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా 1985&comma; 1989&comma; 1994లో ఎమ్మెల్యే గా ఎంపికై&comma; మంత్రిగా పనిచేసిన ఈవూరి సీతారావమ్మ తనయుడు డాక్టర్ ఈవూరి గణేష్ దంపతులను వైసీపీ అధిష్టానం దగ్గరకు తీసుకుంది&period; స్వయంగా సీఎం జగన్ గత నెల 15 న వారిని పార్టీలోకి సాదరంగా చేర్చుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అప్పట్లో పిఆర్పీ అభ్యర్థిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన గణేష్ 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు&period; అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు&period; ఈ నేపథ్యంలో స్థానిక వైసిపి ఇన్చార్జ్ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు 2019 ఎన్నికల్లో ఓటమి చెందడంతో వైసీపీ అధిష్టానం రేపల్లె నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగుర వేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది&period; ఈ నేపథ్యంలో డాక్టర్ ఈవూరి గణేష్ ను పార్టీలోకి తీసుకుని ఇంచార్జీ భాద్యతలు అప్పగించారు&period; ఎంపీ గానే కొనసాగనున్న మోపిదేవికి రాజ్యసభ సభ్యత్వం ఉండడంతో అతని స్థానంలో ఈపూరు గణేష్ కు అవకాశం ఇచ్చేందుకు పార్టీలోకి తీసుకున్నారనే ప్రచారం అప్పట్లోజోరుగా సాగింది&period; నేడు ఇంచార్జీ గా ప్రకటించి వైసీపీ శ్రేణుల్లో కలవరం సృష్టించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.