మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు..

Advertisements

<p>మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు&period; కాంగ్రెస్‌లో సీనియర్లకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలను కొట్టిపారేస్తూనే&comma; గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీనియర్ నేతలకు ఎదురైన పరిస్థితులను ఆయన గుర్తుచేశారు&period; ఢిల్లీ వేదికగా జరిగిన చిట్‌చాట్‌లో సీఎం ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; జీవన్ రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత విమర్శలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు&period; &&num;8220&semi;జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై నేను ప్రత్యేకంగా స్పందించను&&num;8221&semi; అని పేర్కొన్నారు&period; కాంగ్రెస్‌లో సీనియర్లకు అవమానం జరుగుతోందని అంటున్న వారు&comma; బీఆర్ఎస్ నుండి సీనియర్ నేతలు ఎందుకు బయటకు వచ్చారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;<p>&&num;8220&semi;ఒకప్పుడు పార్టీ కోసం పనిచేసిన ఆళ్ల నరేంద్ర&comma; విజయశాంతి&comma; ఈటల రాజేందర్ వంటి నేతలు బీఆర్ఎస్‌ను ఎందుకు వీడాల్సి వచ్చింది&quest; అక్కడ వారికి జరిగిన అవమానం ఏంటో అందరికీ తెలుసు&&num;8221&semi; అని సీఎం అన్నారు&period; మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు ఎక్కడున్నారో&comma; ఆయనకు బీఆర్ఎస్‌లో దక్కిన గౌరవం ఎంతో కనిపిస్తూనే ఉందని ఎద్దేవా చేశారు&period; బీఆర్ఎస్ హయాంలో సీనియర్లకు జరిగిన అవమానాలు గుర్తులేవా&quest; అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు&period; కాంగ్రెస్ ఎప్పుడూ తన నేతలను గౌరవిస్తుందని&comma; కానీ కొందరు కావాలని చేస్తున్న విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందని ఆయన అభిప్రాయపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.