ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు పంపిన రేవంత్ రెడ్డి

Revanth Reddy sent the invitations for the oath taking

Advertisements

&NewLine;<p>తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు&period; ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో రేవంత్‌ చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు&period; గురువారం మధ్యాహ్నం జరగనున్న ప్రమాణస్వీకారానికి రావాలని ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు సోనియాగాంధీ&comma; రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు&period; కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు&comma; పలు రాష్ట్రాల సీఎంలు&comma; మాజీ సీఎంలు&comma; వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది&period; అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్&comma; తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు చంద్రబాబునాయుడుకి&comma; కెసిఆర్ ను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు&period; కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య&comma; ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించారు&period; వీరితోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్&comma; తెలంగాణ అమరవీరుల కుటుంబాలకూ టీపీసీసీ ఆహ్వానం పంపింది&period; టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం&comma; ప్రొఫెసర్ హరగోపాల్&comma; కంచె ఐలయ్యతో పాటు వివిధ కుల సంఘాల నేతలు&comma; సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..