74
నెల్లూరు జిల్లాలో చిరు జల్లులకే రోడ్డు చిత్తడిగా మారుతున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. కావలి పట్టణం ఇందిరమ్మ కాలనీలో స్కూలు ఆటోకు ప్రమాదం తప్పింది. విద్యార్థులను ఎక్కించుకుని వెళుతున్న ఆటో గుంతలో పడి బోల్తా కొట్టబోయింది. అయితే ప్రమాదం నుంచి విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. తేలికపాటి వర్షాలకే రోడ్లపై గుంతల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. ఆటో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగ పోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.