మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చిన రష్యా..

Advertisements

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతోన్న నేపథ్యంలో&period;&period; అమెరికా- ఇరాన్‌ మధ్య మధ్యవర్తిత్వానికి రష్యా ముందుకొచ్చింది&period; ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఫోన్‌లో మాట్లాడారు&period; ఈ క్రమంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని లావ్రోవ్‌ పిలుపునిచ్చారు&period; ఈమేరకు రష్యా విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది&period;<br &sol;>&NewLine;సాయుధ ఘర్షణలు పునరావృతం కాకుండా చూసుకోవాలని లావ్రోవ్‌ పిలుపునిచ్చారు&period; సంక్షోభాన్ని పరిష్కరించడంలో చేతనైనంత సాయం చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు&period; ఇరాన్‌&comma; దాని పొరుగుదేశాల చట్టబద్ధమైన ప్రయోజనాలను గౌరవిస్తామన్నారు&period; ఈ సంఘర్షణను ముగించేందుకు&comma; పశ్చిమాసియాలో దీర్ఘకాల శాంతి కోసం చేస్తున్న దౌత్య ప్రయత్నాలను మాస్కో స్వాగతిస్తుందన్నారు&period; ఈ సందర్భంగా ఇస్లామాబాద్‌లో ఇటీవల అమెరికాతో జరిగిన శాంతి చర్చలకు సంబంధించిన వివరాలను అరాగ్చీ లావ్రోవ్‌కు వివరించారని రష్యా విదేశాంగశాఖ తెలిపింది&period;<&sol;p>&NewLine;<p>అణ్వస్త్రాన్ని వీడేందుకు ఇరాన్ నిరాకరించడంతో అమెరికాతో జరిగిన శాంతిచర్చలు విఫలమయ్యాయి&period; ఈక్రమంలో ఇరాన్‌ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా పునరుద్ఘాటించింది&period; అమెరికాతో భవిష్యత్తులో కుదిరే శాంతిఒప్పందంలో భాగంగా ఈ చర్యకు సిద్ధమైనట్లు క్రెమ్లిన్‌ పేర్కొంది&period; &OpenCurlyQuote;అమెరికా&comma; ప్రాంతీయ నాయకులతో జరిపిన చర్చల్లో అధ్యక్షుడు పుతిన్‌ ఈ ప్రతిపాదన చేశారు&period; ఈ ప్రతిపాదన ఇప్పటికీ అలాగే ఉంది&period; కానీ&comma; దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ పేర్కొన్నారు&period; ఈ సందర్భంగా హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధిస్తామంటూ ట్రంప్‌ బెదిరింపులకు పాల్పడటాన్ని తప్పుబట్టారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.