సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం…

Sadhana Samiti Round Table Meeting

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు కోసం పోరాడేందుకు మంచి అవకాశం దొరికిందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు&period; రాజ్యసభలో కేంద్రానికి మెజార్టీ లేదని&comma; అందువలన అధికార పార్టీని అడ్డుకుంటే ఏపికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు&period; శ్రీకాకుళంలో ప్రత్యేక హోదా&comma; విభజన హామీల సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది&period; ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని&comma; ముగించిన అధ్యాయమన్నారు&period; 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎక్కడా చెప్పలేదన్నారు&period; స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్రానికి సంకల్పం ఉంటే ప్రత్యేక హోదా వస్తుందని స్పష్టం చేశారు&period; పాండిచ్చేరిలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని&comma; అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారని తెలిపారు&period; జల్లికట్టు కోసం తమిళనాడు ప్రజలు ఏ విధంగా ఉద్యమం చేశారో అదేవిధంగా మనం కూడా చేయాలన్నారు&period; వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సంవత్సరం పాటు&comma; రైతులందరూ కలసికట్టుగా ఉద్యమం చేస్తే కేంద్రం దిగివచ్చి నల్ల చట్టాలను రద్దు చేసిందని గుర్తు చేశారు&period; ప్రజలు సంఘటితంగా ఉద్యమిస్తేనే స్పెషల్ స్టేటస్ వస్తుందని లక్ష్మినారాయణ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.