ఎట్టకేలకు సురక్షితంగా…..

41 workers trapped inside the tunnel were finally brought out safely

Advertisements

&NewLine;<p>ఉత్తరాఖండ్ లో నవంబరు 12న ఓ టన్నెల్ కూలిపోగా&comma; 17 రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని టన్నెల్ లోనే చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను ఎట్టకేలకు సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు&period; అధికారులు&comma; సిబ్బంది పడిన శ్రమకు ఫలితం దక్కింది&period; కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు&period; రాష్ట్రపతి ద్రౌపది ముర్ము&comma; ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు&period; కాగా&comma; టన్నెల్ నుంచి కార్మికులను విడతల వారీగా బయటికి తీసుకువచ్చారు&period; వారిని ప్రత్యేక అంబులెన్స్ ల ద్వారా చిన్యాలిసౌర్ లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు&period; టన్నెల్ లో చిక్కుకుపోయిన 41 మందికి రూ&period;1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు&period; వారికి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లేంతవరకు ఆసుపత్రుల్లో చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..