ప్రాచీన ఆలయాల కంటే భిన్నింగా సాయిబాబా ఆలయాలుంటాయి. ఎత్తైన గోపురాలు, గర్భగుడిలేకుండా బాబా ఆలయాలుంటాయి. ఎక్కడ చూసినా ఆలయ నిర్మాణం ఒకేలా అనిపిస్తుంది. అంధ్రప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ఉన్న బాబా ఆలయం మాత్రం చాలా విభిన్నంగా కనిపిస్తుంది. దక్షిణ శిరిడీగా పేరుగాంచిన ఆలయాన్ని చూస్తుంటే నక్షత్రాన్ని తలపిస్తుంది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా భావించే కర్నూలులోని దక్షిణ షిరిడి సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. సుమారు 70ఏళ్ల కిందట నిర్మించిన ప్రత్యేక ఆలయం ఇది. అతిపెద్ద సాయిబాబా ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం తుంగభద్రా నది తీరాన 1.5 ఎకరాల విస్తీర్ణంలో విశాలంగా నిర్మించారు. ఈ ఆలయం తుంగభద్రానది ఒడ్డుపై ఒక రజకునిచే నిర్మించబడింది. నక్షత్రం ఆకారంలో ఉండటం ఈ ఆలయప్రత్యేకత. ఈ ఆలయవాతావరణం చల్లగా, నిర్మలంగా ఉంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీదేవి, హనుమంతుని విగ్రహాలు కూడాఉన్నాయి. ఈ ఆలయాన్ని అన్నివేళల్లో సందర్శించుకునేందుకు అవకాశముంది. కానీ ప్రత్యేక పూజలు మాత్రం ఉదయం, సాయంత్రం వేళల్లోనే నిర్వహిస్తారు. తుంగభద్రా నది నుండి వీచే చల్లనిగాలి ఈ ప్రదేశాన్నిఎంతో ఆహ్లదాన్ని పంచుతుంది. దాదాపు 800 మంది కూర్చుని ధ్యానం చేసుకునే వెలుసుబాటు ఉండేలా పెద్దధ్యాన మందిరాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. ఈ ఆలయం కొండారెడ్డి బురుజుకి దగ్గరలో ఉండడం వల్ల సులభంగా చేరుకోవచ్చు.
సాయిబాబా ఆలయం
65
previous post