అధికారులను కూడా వదలని ఇసుక మాఫియా….

Nandyala Varada Rajulu Reddy

Advertisements

&NewLine;<p>కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా&comma; అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని&comma; చివరకు పోలీస్ అధికారుల మీద&comma; ఫారెస్ట్ అధికారుల మీద ఇసుక మాఫియా దాడులు చేసే స్థితికి పెరిగిపోయిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి ఆరోపించారు&period; నంగనూరు పల్లె ఫారెస్ట్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై ఇసుక మాఫియా ట్రాక్టర్ తో వాహనాన్ని ఢీ కొట్టించి గాయపరిచే చర్యలకు పాల్పడ్డారని&comma; ఇది దారుణమని మాజీ ఎమ్మెల్యే వరద అన్నారు&period; 50 మంది ప్రజా ప్రతినిధులను తన వెంట తీసుకువెళ్లి ప్రొద్దుటూరులో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు&period; అధికార పార్టీ నేతల అండదండలతోనే ఇసుక మాఫియా పేట్రేగిపోతోందని విమర్శించారు&period; జిల్లా ఎస్పీ ఎందుకు ఈ అసాంఘిక&comma; అక్రమ కార్యకలాపాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు&period; నియోజకవర్గంలో అక్రమ వ్యవహారాలను అరికట్టకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని&comma; అధికారులు అభద్రతతో పని చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.