సంక్రాంతి ముగ్గుల పోటీలు…

MLA Katasani Ramireddy

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం హై స్కూల్ ఆవరణలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బనగానపల్లె ఎమ్మెల్యే తనయుడు కీ&period;శే నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలను శనివారం ఉదయం బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి&comma; ఆయన సతీమణి జయమ్మలు ప్రారంభించారు&period; ముందుగా హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి కుటీరాన్ని ఎమ్మెల్యే దంపతులు ప్రారంభించి&comma; అనంతరం భోగి మంటలను అంటించారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి కాటసాని జయమ్మ&comma; వారి కోడలు శ్రీమతి కాటసాని మేధా శ్రీరెడ్డి ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన మహిళలు భోగి మంటల ముందు నృత్యాలు చేశారు&period; అనంతరం ముగ్గుల పోటీలను ఎమ్మెల్యే కాటసాని దంపతులు ప్రారంభించారు&period; ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు&period; ముగ్గుల పోటీలకు విచ్చేసిన వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం ఎమ్మెల్యే కాటసాని దంపతులు ఏర్పాటు చేశారు&period; ఈ సందర్భంగా స్థానిక వే టు డాన్స్&comma; జబర్దస్త్ టీమ్ నిర్వహకులచే డాన్స్ కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి&period; ముగ్గుల పోటీల్లో గెలిచిన విజేతలకు మొదటి బహుమతి రేణుకకు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్&comma; రెండవ బహుమతి భారతికి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్&comma; మూడవ బహుమతి ఇంద్రవతికి ఎల్ ఈడి టీవీ&comma; నాల్గవ బహుమతి అంజనమ్మకు వాషింగ్ మిషన్&comma; ఐదవ బహుమతి నీరజకు రైస్ కుక్కర్ లను బహుమతుల ప్రదాత కాటసాని జయమ్మ అందచేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్