46
రేపు జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సత్తుపల్లి వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రేపు 292 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనున్నది. సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా 2,43,181 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్నిపోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే ఓటు వేసే అవకాశం కల్పించారు. సత్తుపల్లిలో కొన్ని గ్రామాలు సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో కంపెనీలకు చెందిన భద్రతా బలగాలు భారీగా మోహరించారు.సత్తుపల్లి నియోజకవర్గంలో 292 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఎన్నికల సిబ్బంది, రక్షణ బలగాలు సిద్ధమయ్యాయి.