దివంగత ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యురాలు హాజియా ఎం డి. కరిమున్నీసా ద్వితీయ వర్ధంతి సందర్భంగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కోట్లు సెంటర్లో కుటుంబ సభ్యులు ఆదివారం సంతాప సభ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు పారిశుధ్య కార్మికులకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. సంతాప సభ అనంతరం పైపుల్ రోడ్ సెంటర్ అంబాపురం పంచాయతీ పరిధిలో దివంగత నేత కరిమున్నిసా జ్ఞాపకార్థం వారి కుమారులు ఎమ్మెల్సీ రుహుల్లా తమ సొంత నిధులు 1.70లక్షలతో మస్జిద్ కరిమున్నీసా మరియు మదర్సా నిర్మాణ పనులు లాంచనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో ముస్లిం మత పెద్దలు హాజరై ప్రేత్యేక ప్రార్ధనలు చేశారు.. ముఖ్య అతిధులుగా సెంట్రల్, పశ్చిమ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజ, విచ్చేసి తమ సంతాపాన్ని తెలియచేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
హాజీయ ఎం డి కరిమున్నిసా ద్వితీయ వర్ధంతి..
75
previous post