రూపురేఖలు మారిన సికింద్రాబాద్..

Advertisements

<p>సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే ఒకప్పుడు రద్దీ&comma; గజిబిజి&period;&period; కానీ ఇకపై అది గతం&excl; ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లా మెరిసిపోతోంది&period; దక్షిణ మధ్య రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయి&period; సుమారు 719 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో స్టేషన్ రూపురేఖలనే మార్చేశారు అధికారులు&period; అడుగు పెడితే రైల్వే స్టేషనా లేక విమానాశ్రయమా అనే భ్రమ కలిగేలా అధునాతన హంగులు అద్దారు&period; ఈ అద్భుత కట్టడాన్ని జాతికి అంకితం చేసేందుకు ముహూర్తం ఖరారైంది&period; వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు&period; ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ ఫేజ్-1 పనులను ఆయన ప్రారంభించనున్నారు&period; దీంతో పాటు యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు శంకుస్థాపన&comma; పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలు ప్రధాని చేతుల మీదుగా జరగనున్నాయి&period;<&sol;p>&NewLine;<p>తొలి దశలో భాగంగా ప్లాట్‌ఫామ్-10 వైపు పనులు పూర్తి కావచ్చాయి&period; నాలుగు అంతస్తులతో&comma; 22&comma;516 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఐకానిక్ స్టేషన్ భవనం సిద్ధమైంది&period; దక్షిణం వైపు మరో 14&comma;972 చదరపు మీటర్ల భవనం కూడా రెడీ అయ్యింది&period; ఎస్కలేటర్లు&comma; ఎలివేటర్లతో నేరుగా ఒకటో అంతస్తులోకి వెళ్లే సదుపాయం&comma; అక్కడ వెయింటింగ్ హాళ్లు&comma; షాపింగ్ మాల్స్ ప్రయాణీకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి&period; ప్రయాణీకుల సౌకర్యం కోసం రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది&period; బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్‌లోకి రావడానికి&comma; తిరిగి వెళ్లడానికి ప్రత్యేకంగా స్కైవాక్‌లను ఏర్పాటు చేశారు&period; ప్లాట్‌ఫామ్‌à°² పైభాగంలో వెయింటింగ్ ఏరియాలు&comma; కింద రైళ్లు వెళ్లేలా డిజైన్ చేసిన ఈ స్టేషన్&period;&period; గతం కంటే పూర్తి భిన్నంగా కనిపిస్తోంది&period; మార్చి నెలాఖరుకల్లా ప్లాట్‌ఫామ్-10 వైపు పనులు పూర్తి చేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>స్టేషన్ అభివృద్ధి పనుల వల్ల ఇప్పటివరకు పలు రైళ్లను చర్లపల్లికి మళ్లించారు&period; దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు&period; అయితే&comma; పనులు పూర్తి కావస్తుండటంతో త్వరలోనే రైళ్లన్నీ తిరిగి సికింద్రాబాద్ నుంచే నడవనున్నాయి&period; రెండో దశ పనులను కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసేలా రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది&period; మొత్తానికి&comma; ఆధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విశ్వనగరానికి మరో మణిహారంగా మారబోతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.