కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికీ ఫ్రీ కరెంట్ ఇచ్చిందని సంబర పడ్తుంటే ఓ ఇంటి యజమానికి మాత్రం భారీ షాక్ ఇచ్చారు విద్యుత్ శాఖ అధికారులు. అది డిసెంబర్ నెలకు చెల్లించాల్సిన కరెంట్ బిల్లు అక్షరాల 2 లక్షల 78 వేల 500 రూపాయిలు అంటూ బిల్లు పంపించారు. ఇంత పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లును చూసి షాక్ అయ్యాడు సదరు ఇంటి యజమాని. వివరాల్లోకి వెళ్తే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో ముళ్ల పేట వార్డ్ లో ఉంటున్న మల్లికార్జున్ అనే చేనేత కార్మికుడు ఇంటికి కరెంట్ బిల్లు 2,78 500 రూపాయలు వచ్చింది. బిల్లు చూసి అవాకైనా మల్లికార్జున్ కుటుంబ సభ్యులు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఇంత బిల్లు తాను ఎలా కట్టాలి అని ప్రశ్నించాడు. ఈ బిల్లు కట్టాలి అంటే తన పాత ఇల్లు అమ్మినా కట్టలేనంటూ మీడియా ముందు వాపోయాడు.
కరెంట్ బిల్లును చూసి షాక్..!
87
previous post