అంగరంగ వైభవంగా శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం…

The district collector visited the temple and paid his respects

Advertisements

&NewLine;<p>రెబ్బెన మండలంలోని గంగాపూర్ లో నిర్వహించే మూడు రోజుల జాతరకు రెండవ రోజు జాతర సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు&period; జాతర సందర్భంగా వచ్చిన జిల్లా కలెక్టర్ బర్కడే హేమంత్ సహదేవరావు కు ఆలయ కమిటీ ఈవో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు&period; ఈ జాతరకు కొమరం భీం జిల్లా నే కాకుండా మహారాష్ట్ర ఇతర జిల్లాల నుండి కూడా దర్శనార్థం భక్తులు వస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన గంగాపూర్ శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు&period; శుక్రవారం నుంచి ఆదివారం వరకు అంగరంగ వైభవంగా ఈ జాతర మహోత్సవం సాగనుంది&period; రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని నది ఒడ్డున కొలువైన శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది&period; మొదటి రోజు స్వామి వారి కల్యాణం&comma; రెండోరోజు రథోత్సవం&comma; మూడో రోజు భక్తులకు దర్శనం తర్వాత జాతర ముగియనుంది&period; ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులతో పాటు కరీంనగర్&comma; వరంగల్&comma; మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు&period; జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని జిల్లా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు&period; బాలాజీ వెంకన్న కొలువైన తీరు గంగాపూర్ శివారులోని గుట్టపై ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి కొలువైన తీరు&comma; ఆలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలు ఇలా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం&period;&period; సుమారు 16వ శతాబ్దానికి ముందు ఇదే గ్రామానికి చెందిన ముమ్మడి పోతాజీ అనే భక్తుడు చిన్నతనం నుంచి భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలుస్తూ ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున తిరుమల తిరుపతి వరకు కాలినడకన వెళ్లి మొక్కులు చెల్లించుకునేవాడు&period; కాలక్రమేనా వయస్సు పైబడం తోపాటు ఆరోగ్యం సహకరించక తిరుపతి వరకు వెళ్లలేకపోవడంతో మనోవేదనకు గురవుతాడు&period; స్వామి వారే పోతాజీ కలలో కనిపించి గ్రామ పొలిమేరలోని గుట్టలో కొలువై ఉన్నానని&comma; ఆలయం నిర్మించాలని కోరినట్లు స్థానికులు చెప్పుకుంటారు&period; ఏటా మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన నీకోసం&comma; నీలాంటి భక్తుల కోసం దర్శనం ఇస్తానని చెప్పినట్లు ప్రచారంలో ఉంది&period; దీంతో గంగాపూర్ వాగులో పుణ్యస్నానమాచరించి గుట్టను తొలగవ స్వామి పట్టెనామాలు దర్శనమిచ్చినట్లు చెబుతుంటారు&period; నాటి నుంచి నేటి వరకు ప్రతీ మాఘ శుద్ధ పౌర్ణమి పర్వదినాన స్వామివారు ఆలయంలో కొన్ని గడియలు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంటాడని నమ్మకం ఏర్పడింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం.

105 కేసుల నిందితుడిని అరెస్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు.