విశాఖ(Visakhapatnam) మత్స్యకారులతో టీడీపీ పార్లమెంటరీ ఇంఛార్జి శ్రీ భరత్…
విశాఖ మత్స్యకార జీవన స్థితి గతులను వారి వృత్తిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు స్ధానిక గంగపుత్రులతో కలిసి ఒక రోజు వారితో పాటు గడిపారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మత్స్య ఉత్పత్తులను పరిశీలించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలు, మరియు ఇతర ప్రోత్సాహకాల పై ఆరా తీసి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. మత్స్యకారులను SC ల్లో కలుపుతానని ప్రస్తుత ప్రభుత్వం మోసం చేసింది అని ఆయన అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
భీమిలి(Bhimili)లో నూతన జెట్టి నిర్మాణానికి కృషి చేస్తా…
మత్స్య వేట అనేది ఒక జీవన విధానం అని, మత్స్యకారుల వృత్తి అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ అని వారిని చిన్నచూపు చూడటం సమాజానికి మంచిది కాదన్నారు.. వారిలో ఈ మధ్య ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారని వారందరినీ మరింత ప్రోత్సహించాలి అని ఆయన అన్నారు. వారి అభివృద్ధి కోసం విశాఖ హార్బర్ అభివృద్ధితో పాటు భీమిలి లో నూతన జెట్టిల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు..
కోల్డ్ స్టోరేజ్ అభివృద్ధి మరియు డ్రై ఫిష్ మార్కెట్ పై శ్రద్ధ పెట్టని ప్రభుత్వం…
కోల్డ్ స్టోరేజ్ అభివృద్ధి మరియు డ్రై ఫిష్ మార్కెట్ కోసం ఈ ప్రభుత్వం కనీసం శ్రద్ధ పెట్టలేదు అని ఆయన విమర్శించారు. చిన్న మత్స్యకారుల బోట్ల నిర్మాణం మరియు సబ్సిడీ మీద మరపడవలు రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో అందించేలా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా సముద్రం లో మత్స్యకారులతో వెళ్లి వారితో వేట నిర్వహించారు. స్వయంగా ఆయనే చేపలు పట్టి అక్కడ మత్స్యకారులతో కలిసి విందు ఆరగించారు. ఈ సందర్భంగా సముద్రంలో మత్స్యకారులతో ఇంఛార్జి శ్రీ భరత్(Incharge Shri Bharat) కలిసి ఈత కొట్టారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి