శ్రీకాకుళం జిల్లాలో భారీ గోల్క్ స్కామ్..

Advertisements

<p>శ్రీకాకుళం జిల్లా రాజాంలో భారీ గోల్డ్ స్కీమ్ కుంభకోణం బట్టబయలైంది&period; ఆకర్షణీయమైన ప్రకటనలు&period;&period; ఆశచూపే ఆఫర్లు&period;&period; వీటి వెనుక సామాన్యులను నిలువునా ముంచేస్తున్న &&num;8216&semi;వైశ్య రాజు జువెలరీ&&num;8217&semi; ఆగడాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి&period; CVR న్యూస్ నిర్వహించిన ప్రత్యేక స్ట్రింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి&period; 11 నెలల బంగారు నగల పథకం పేరుతో రాజాం పట్టణంలోని వైశ్య రాజు జువెలరీ సామాన్యుల ఆశలను పెట్టుబడిగా మార్చుకుంటోంది&period; 1978 చిట్‌ఫండ్ చట్టం ప్రకారం ఇటువంటి డిపాజిట్ స్కీమ్‌లు నిర్వహించడం నేరమని తెలిసినా&period;&period; ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఈ సంస్థ యథేచ్ఛగా అక్రమ దందాను కొనసాగిస్తోంది&period; కస్టమర్ల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నా&comma; ఎటువంటి అధికారిక పత్రాలు ఇవ్వకుండా&comma; ప్రభుత్వానికి చెల్లించాల్సిన GSTని ఎగవేస్తూ అక్రమ వ్యాపారానికి తెరలేపింది&period; 24 క్యారెట్ల బంగారానికి డబ్బులు వసూలు చేసి&comma; తీరా 11 నెలల తర్వాత మాత్రం 22 క్యారెట్ల బంగారాన్ని అంటగడుతున్నారు&period; తరుగు&comma; మజూరీ లేదని నమ్మించి&period;&period; చివరకు కస్టమర్లకు భారీగా నామం పెడుతున్నారు&period; ఇక పాత బంగారం డిపాజిట్ చేస్తే ఆరు నెలల తర్వాత కొత్త నగలు ఇస్తామని చెప్పి&period;&period; తీరా గడువు ముగిశాక 8&period;4 శాతం వరకు తరుగు వేస్తూ వినియోగదారుల కళ్లకు గంతలు కడుతున్నారు&period; బహిరంగంగానే ఈ అక్రమ స్కీమ్‌లు నడుస్తున్నా&period;&period; సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న&period; సదరు యాజమాన్యం బోర్డు తిప్పేస్తే తమ పరిస్థితి ఏంటని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు&period; అడ్డగోలుగా సామాన్యుల రక్తాన్ని పిలుస్తున్న ఇటువంటి సంస్థలపై జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాజాం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.