102
దేశంలోనే మొట్ట మొదటి సారిగా సిలిండర్ల లో గంజాయి ని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన నలుగురిని మేడ్చల్ ఎస్.ఓ.టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్ ఆగ్రా కు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్ లలో గంజాయి నింపి తీసుకెళ్తున్నారు. మేడ్చల్ లో జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు. నలుగురు నిందితుల ను అదుపులోకి తీసుకుని విచారించగా,వారి వద్ద నుండి 65 కేజీల గంజాయి, 2 కార్లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ 40లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.