గోల్డెన్ టెంపుల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..!

Golden Temple

Advertisements

&NewLine;<p>అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ గురించి చాలా మందికి తెలిసిందే&period; ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలాల్లో ఒకటి&period; ఈ గురుద్వార గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం&period; పంజాబ్‌లోని ఈ అమృత్‌à°¸‌ర్‌ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు&period; ఇది దేశంలోనే అత్యంత సుందరమైన పవిత్ర స్థలాల్లో ఒకటి&period; అలాగే సిక్కుల ప్రధాన గురుద్వార్ కూడా ఈ స్వర్ణ మందిరమే&period; దీంతో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి కేవలం సిక్కులు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు&period; ఎవరైనా ఈ ఆలయ సముదాయంలోకి అడుగు పెట్టగానే ఎక్కడా దొరకని ప్రశాంతత ఆవహిస్తుంది&period; ఈ గోల్డెన్ టెంపుల్ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే ప్రార్థనా మందిరాల్లో ఒకటిగా పేరుగాంచింది&period; తిరుమల శ్రీవారిని నిత్యం వాలేది మంది భక్తులు దర్శించుకున్నట్లే ఇక్కడికి కూడా దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీ టూరిస్టులు సైతం ఎంతో మంది వచ్చి ఈ గురుద్వారను సందర్శిస్తుంటారు&period; ఈ గురుద్వారకున్న ప్రత్యేకమైన ఆకర్షణే బంగారు తాపడం&period; ఈ మందిరం చుట్టూ 24 క్యారెట్ల బంగారు పూతను అద్దడం విశేషం&period; దీంతో ఈ ఆలయానికి స్వర్ణమందిరం అనే పేరొచ్చింది&period; మహారాజా రంజిత్ సింగ్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఆలయానికి బంగారం జోడించాలని అనుకున్నారు&period; అలా మొదట 162 కిలోల బంగారు పూతతో ప్రారంభించగా 90à°² కాలంలో 500 కిలోల బంగారు పూతను ఆలయానికి అతికించారు&period; దీంతో ఈ గురుద్వార దగదగలాడుతుంది&period; ఈ గోల్డెన్ టెంపుల్‌లో నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజన ఏర్పాట్లు చేస్తుంది&period; దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లంగర్ సేవను అందిస్తున్న దేవాలయంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది&period; ఇక్కడికి వచ్చే భక్తులూ&comma; టూరిస్టులు ఎవరైనా సరే నేల మీద కూర్చొనే ఆహారం తీసుకుంటారు&period; ఇక్కడ కులమతాలకతీతంగా ప్రతి ఒక్కర్నీ సమానంగా చూడటం విశేషం&period; దీంతో వేలాదికి మందికి ఇక్కడ ఉచితంగా ఆహారం అందుతుంది&period; మీరెప్పుడైనా ఈ స్వర్ణ మందిరాన్ని నిశితంగా పరిశీలించారా&quest; అలా గమనిస్తే ఈ ఆలయ నిర్మాణ శైలి మీకు అర్థమవుతుంది&period; ఈ ఆలయాన్ని హిందూ &&num;8211&semi; మొఘల్ కలయిక శైలిలో అద్భుతంగా నిర్మించారు&period; గోపురం వెలుపలి భాగం నుండి కిటికీలు&comma; గుమ్మాల వరకు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి&period; దీంతో ఈ గోల్డెన్ టెంపుల్ నిర్మాణ కూడా ఓ అద్భుతమనే చెప్పాలి&period; ఇతర మతపరమైన ప్రదేశాల మాదిరిగా కాకుండా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి ఉండే మెట్ల మార్గం కిందకు ఉంటుంది&period; అంటే దీని అర్థం దేవుడి దగ్గరకు వచ్చే భక్తులు తమకున్న అహంకారం&comma; రాగద్వేషాలను వదులుకొని వినయ పూర్వకంగా మెలగాలని&period; ప్రతి ఒక్కరూ ఇలాంటి నిరాడంబరమైన జీవనశైలిని కలిగి ఉంటే దేవుని ఆశిస్సులు ఉంటాయనేది దానివెనకున్న ఉద్దేశం&period; ఈ ఆలయం అన్ని మతాల వారికీ తెరిచి ఉంటుంది&period; అందుకే ఈ ఆలయానికి నలుదిక్కులా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు&period; అంటే ఇది అన్ని మతాల వారినీ ఆదరిస్తుందని అర్థం&period; మరోవైపు ఆలయ నిర్మాణ సమయంలోనూ గురు అర్జన్ దేవ్ సుఫీ సెయింట్ మియాన్ మీర్‌ను ఆలయ శంకుస్థాపనకు ఆహ్వానించారు&period; దాంతో అక్కడ కుల&comma; మతాలతో సంబంధం లేకుండా ఆలయానికి ఎవరైనా వెళ్లొచ్చనే భావన కలిగించారు&period; అలాగే ఈ స్వర్ణ మందిరంలో ఎవరైనా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గోల్డెన్ టెంపుల్‌లో మీ సేవలు అందించవచ్చు&period; అక్కడ మీరు సేవ చేయడానికి కచ్చితంగా సిక్కులే అయి ఉండాల్సిన పనిలేదు&period; మీకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే హ్యాపీగా అక్కడ పాల్గొనవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.