‘భోగేశ్వరాలయం’ ప్రత్యేకతలు

Bhogeshwaralayam

Advertisements

&NewLine;<p>ఆధ్యాత్మిక&comma; చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి&period; ఒక్కసారి వాటిని పరిశీలిస్తే నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు&period; అలాంటి ఆలయాల్లో &OpenCurlyQuote;భోగేశ్వరాలయం’ ఒకటి&period; కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం&period;&period; వరంగల్ రైలు స్టేషన్ కి మూడు కిలోమీటర్ల దూరంలోని మట్టెవాడ ప్రాంతంలో వుంది&period; ఈ ఆలయానికి &OpenCurlyQuote;భోగేశ్వరాలయం’ అనే పేరు రావడం వెనుక ఓ పురాణ కథ అమలులో వుంది&period; ప్రతిరోజూ రాత్రిపూట ఒక పాము ఇక్కడికొచ్చి ఈశ్వరుని సేవించేదట&period; పానవట్టముమీద పైనున్న లింగభాగాన్ని జరపటానికి వీలుగా వున్నది&period; దాని క్రింది భాగం బోలుగా వుంటుంది&period; ఇక్కడ అడుగుభాగంలో శివలింగం కింద మేరు ప్రస్తారంలో శ్రీ చక్రం వుందట&period; శీచక్రం బిందుస్ధానంలో మరొక చిన్న రాతి శివలింగం వుంది&period; అక్కడ ఒక పెద్ద శ్రీ చక్రము&comma; ఆ శ్రీచక్రబిందు స్ధానంలో ఒక లింగము&comma; శ్రీ చక్రాన్ని కప్పివేస్తూ నిర్మించిన పెద్దపానవట్టము&comma; ఆ పానవట్టముమీద కదల్చటానికి వీలుగా చెక్కిన మరొక శివలింగము వున్నాయి&period; దానికింద పదకొండు à°¶à°¿à°µ లింగాలు వున్నాయని&comma; అందుకే ఈ భోగేశ్వర స్వామికి ఒక్కసారి అభిషేకంచేస్తే ఏకాదశరుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కుతుందంటారు&period; ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ ఎన్ని బిందెలనీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసినా ఆ నీరు ఒక్క చుక్కైనా బయటికి రాదు ఎక్కడికి పోతుందో కూడా తెలీదు&period; ఈ లింగానికి వెనుక భాగంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహం కూడా ప్రతిష్టించబడింది&period; ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయం ప్రసిద్ధి చెందకపోవడానికి కొన్ని వాస్తుదోషాలు వున్నాయని చెబుతారు&period; స్వామి ఉత్తర ముఖంగా వున్నాడు&period; అంటే పూజించేవారు దక్షిణ ముఖంగా వుండి చెయ్యాలి&period; అది శాస్త్ర సమ్మతం కాదంటారు&period; నైఋతిలో బావి వుందన్నారు కానీ వాస్తుదోషం కారణంగా దానిని మూసేశారుట&period; ఆలయ ప్రవేశద్వారం ఈశాన్యంలో వున్నది&period; ఇదికూడా వాస్తు శాస్త్ర విరుధ్ధమే&period; ఈ ఆలయంలో శివరాత్రి వగైరా పర్వదినాలలో ప్రత్యేక పూజలే కాక మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంరోజున ద్వార దర్శనం వుంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..