15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్

Advertisements

<p>భారత క్రికెట్‌కు మరో అద్భుతమైన యువ సంచలనం దొరికింది&period; కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 సీజన్‌ను తన పేలవమైన కాదు&comma; పేలుడు బ్యాటింగ్‌తో ఏకంగా శాసించాడు&period; రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు రికార్డుల వర్షం కురిపిస్తూ ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు&period; సీజన్ ముగింపు వేడుకలో వైభవ్ ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక వ్యక్తిగత అవార్డులను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు&period; ఆరెంజ్ క్యాప్&comma; మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ &comma; ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్&comma; సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్&comma; సూపర్ సిక్సెస్ అవార్డులను కైవసం చేసుకుని ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు&period;<br &sol;>&NewLine;ఈ సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు సాధించిన వైభవ్&comma; ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు&period; 237&period;31 స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అతడు&comma; ఒకే సీజన్‌లో 72 సిక్సర్లు బాదుతూ కొత్త రికార్డు నెలకొల్పాడు&period; 400&comma; 500&comma; 600 పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా చేరుకున్న యువ ఆటగాడిగానూ గుర్తింపు పొందాడు&period;వైభవ్ ఆటతీరును చూసి క్రికెట్ దిగ్గజాలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు&period; అతని బ్యాటింగ్‌లో కనిపిస్తున్న ధైర్యం&comma; పరిణతి&comma; దూకుడు భారత క్రికెట్ భవిష్యత్తుపై ఆశలు పెంచుతున్నాయి&period; అవార్డుల అనంతరం స్పందించిన వైభవ్ &OpenCurlyDoubleQuote;ఈ సీజన్‌లో నాకు అండగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ సీనియర్ ఆటగాళ్లు&comma; కోచింగ్ సిబ్బంది&comma; సపోర్ట్ స్టాఫ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ కృతజ్ఞతలు తెలిపాడు&period;చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో మెరిసిపోతున్న వైభవ్ సూర్యవంశీ&comma; భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్‌గా అవతరించే దిశగా దూసుకుపోతున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.