భారత ఘాటింగ్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత.

భారత ఘాటింగ్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత

Advertisements

<p>దిగ్గజ షూటర్‌&comma; ప్రఖ్యాత కోచ్‌ జస్పాల్‌ రాణా కన్నుమూశారు&period; కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన&period;&period; తుదిశ్వాస విడిచారు&period; భారత్ స్టార్ షూటర్ మను బాకర్‌ ఈయన కోచింగ్‌లోనే రాటుదేలిన సంగతి విదితమే&period;<br &sol;>&NewLine;ISSF వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇటీవల జర్మనీ నుంచి భారత్‌కు తిరిగివస్తుండగా రాణా అనారోగ్యానికి గురయ్యారు&period; విమానం దిగిన వెంటనే ఆయన్ను దిల్లీలోని ఆసుపత్రిలో చేర్పించారు&period; అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు&period; ఈ విషయాన్ని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించింది&period; &OpenCurlyQuote;జర్మనీలో వరల్డ్‌కప్ సందర్భంగా జస్పాల్‌కు ఛాతినొప్పి&comma; అసౌకర్యం కలిగాయి&period; ఎసిడిటీగా పొరబడి&period;&period; తన పనిలో నిమగ్నమయ్యాడు&period; అయితే భారత్‌కు వచ్చేటప్పుడు మళ్లీ అసౌకర్యానికి గురయ్యాడు&period; దాంతో ఆసుపత్రిలో చేరాడు’’ అంటూ జస్పాల్‌ సోదరుడు సుభాష్ వెల్లడించారు&period; పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు గెలిచిన మను బాకర్‌కు రాణా వ్యక్తిగత కోచ్‌గా వ్యవహరించారు&period; 2006 ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు గెలిచిన జస్పాల్‌&period;&period; గతంలో జాతీయ జూనియర్‌ కోచ్‌గా వ్యవహరించారు&period; అప్పుడే మను బాకర్&comma; సౌరభ్‌ చౌదరి లాంటి ప్రతిభావంతులైన షూటర్లు వెలుగులోకి వచ్చారు&period; ఒలింపిక్స్‌ విజయాల అనంతరం ఆయన గత ఏడాది ఫిబ్రవరిలో జాతీయ కోచ్‌గా నియమితులయ్యారు&period; 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో హై పర్ఫార్మెన్స్‌ కోచ్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు&period; జస్పాల్ రాణా మృతిపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ఆయన మరణం భారత క్రీడా ప్రపంచానికి తీరనిలోటు&period; షూటింగ్‌లో ఆయన సాధించిన విజయాలతో దేశానికి ఎంతో పేరు తీసుకువచ్చారు&period; యువ అథ్లెట్లను తీర్చిదిద్దడంలో ఆయన చూపిన నిబద్ధత ఎనలేనిది&period; ఈ విషాద సమయంలో ఆయన కుటుంబం&comma; ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని మోదీ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.