దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.

దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం

Advertisements

<p>దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి&period;తాజాగా తుగ్లకాబాద్‌లోని ఓ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా&comma; పలువురు గాయపడ్డారు&period; సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు&period; గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు&period; ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు&period; ఘటనపై కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు&period; ఇదిలా ఉంటే&period;&period; రాజధానిలో తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాల నేపథ్యంలో భవన భద్రతా నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది&period; 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న నివాస భవనాలు&comma; అపార్ట్‌మెంట్లలో కూడా అగ్నిమాపక భద్రతా చర్యలను తప్పనిసరి చేసేలా ఉపచట్టాలను రూపొందించే ప్రక్రియను పరిశీలిస్తోంది&period; అన్ని భవనాల్లో స్మోక్ డిటెక్టర్లు&comma; అగ్నిమాపక నిరోధక పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిఫార్సు చేసినట్లు అధికారులు తెలిపారు&period; ఇప్పటికే నిర్మితమైన భవనాల్లోనూ కనీస భద్రతా ప్రమాణాలు అమలు చేసేందుకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు&period; ఇటీవల మాల్వీయనగర్‌&comma; వివేక్ విహార్‌ వంటి ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంది&period; ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని కఠిన అగ్నిమాపక నిబంధనల అమలుకు చర్యలు వేగవంతం చేయనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.