విజయనగరం జిల్లా బొబ్బిలిలో గ్రామీణ యువతకు క్రికెట్ సామగ్రి పంపిణీ.

విజయనగరం జిల్లా బొబ్బిలిలో గ్రామీణ యువతకు క్రికెట్ సామగ్రి పంపిణీ

Advertisements

<p>విజయనగరం జిల్లా బొబ్బిలిలో గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే వినూత్న కార్యక్రమం నిర్వహించారు&period; బొబ్బిలి క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువ క్రీడాకారులకు క్రికెట్ సామగ్రిని పంపిణీ చేశారు&period; బొబ్బిలి పట్టణ సీఐ నారాయణరావు చేతుల మీదుగా యువ క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్లు&comma; బంతులు అందజేశారు&period; పారాది&comma; అలజంగి&comma; వెలగవలస&comma; జగన్నాథపురం&comma; అప్పయ్యపేట&comma; చెరువుగట్టు తదితర గ్రామాలకు చెందిన యువ క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని సామగ్రిని అందుకున్నారు&period; యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సీఐ నారాయణరావు సూచించారు&period; గంజాయి&comma; డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడలు&comma; విద్య వంటి సృజనాత్మక రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు&period; కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా సీఐ నారాయణరావు యువ క్రీడాకారులతో కలిసి మైదానంలోకి దిగి కొంతసేపు క్రికెట్ ఆడారు&period; బ్యాట్ పట్టి షాట్లు ఆడుతూ క్రీడాకారులతో మమేకమయ్యారు&period; పోలీసు అధికారి తమతో కలిసి ఆటలో పాల్గొనడం యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపగా&comma; క్రీడాభిమానులు చప్పట్లతో అభినందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.