ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విశ్వ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్, యువ కెరటం దొమ్మరాజు గుకేశ్ నిలిచాడు.ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, డింగ్ లిరెన్ ను ఓడించి ఛాంపియన్‌గా నిలవాలన్న కల నెరవేర్చుకున్నాడు. ఈ విజయంతో గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వేదికపై విజేతగా నిలిచి.. దేశ ఖ్యాతిని మరో పెట్టు ఎక్కించిన గుకేశ్.. తెలుగు కుర్రాడు. ఇతని తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా. తండ్రి.. రజనీకాంత్. ఈయన పేరు మోసిన డాక్టర్. చెవి, ముక్కు, గొంతు సర్జన్. తల్లి.. పద్మ. ఈమె మైక్రోబయాలజిస్ట్. ఈ దంపతులు చెన్నైలో స్థిరపడటంతో.. గుకేశ్ 29 మే, 2006న చెన్నైలో జన్మించారు. తల్లిందండ్రులిద్దరూ మంచి చదువులు చదివిన వారు కావడంతో కొడుకును ఉన్నత హోదాలో చూడాలనుకున్నారు. కానీ, వారి కుమారుడు అంచనాలను తలకిందులు చేస్తూ చదరంగాన్ని ఎంచుకున్నాడు. 7 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. తొలి రోజుల్లో రోజుకు గంట చొప్పున వారంలో మూడు రోజులు సాధన చేసేవాడు. అలా మొదలైన అతని చదరంగ నైపుణ్యం ఉపాధ్యాయులను ఎంతో ఆకట్టుకుంది. మెళుకువలు నేర్చుకున్న అనంతరం వారాంతాల్లో టోర్నమెంట్లలో పాల్గొనడం మొదలు పెట్టాడు. ఇతనికి తొలి విజయం అంటే.. తొమ్మిదేళ్ల వయస్సులో 2015లో ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ 12 విభాగంలో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకొని ప్రశంసలు అందుకున్నాడు. అనంతరం 12 ఏళ్ల వయసులో అండర్ 12 విభాగంలో ఆసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఐదు బంగారు పతకాలు సాధించాడు. 2017లో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. తద్వారా 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయస్సులో గ్రాండ్ మాస్టర్ అర్హత సాధించిన మూడో పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 2023.. గుకేశ్ తనను తాను ప్రపంచానికి తెలిసొచ్చేలా చేసిన సంవత్సరం. గతేడాది ఆగస్ట్‌లో 2750 రేటింగ్‌తో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించి 36 ఏళ్లలో తొలిసారి దేశ అగ్రశ్రేణి ఆటగాడిగా నిలిచాడు. అనంతరం క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచి 40 ఏళ్ల క్రితం గ్రేట్ గ్యారీ కాస్పరోవ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఈ విజయంతో భారత ఖ్యాతిని మరో మెట్టు పెంచాడు.
విశ్వ విజేతగా నిలిచిన గుకేశ్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అద్భుత విజయంతో దేశం గర్వపడేలా చేశావని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. అద్భుతమైన విజయం సాధించిన గుకేశ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. చెస్ చరిత్రలో గుకేశ్ అతని పేరు చిరస్థాయిగా నిలవడమే కాకుండా యువతకు గొప్ప కలలు కనేందుకు మార్గం చూపావని ప్రధాని కొనియాడారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి