భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి రజతం సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. దీంతో మొత్తం 12 మంది పోటీ పడ్డ ఫైనల్లో రెండో స్థానంలో నిలిచాడు. పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ 92.97 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్ కాంస్యం వచ్చింది. ఫైనల్ బరిలో మొత్తం ఆరు ప్రయత్నాల్లో నీరజ్ కేవలం రెండో త్రోలోనే సఫలమయ్యాడు. మిగతా అన్ని ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. పాక్ ఆటగాడు అర్షద్ రెండు సార్లు 90 మీటర్ల కంటె ఎక్కువగా ఈటెను విసిరాడు. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించింది. వీటిలో తొలి సిల్వర్ మెడల్ నీరజ్‌దే.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఈనెల 29 న ఏపీలో మోదీ పర్యటనకూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారి ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పట్నానికి రానున్నారు . ఈ నెల 29న విశాఖకు రానున్న మోదీ. ఆంధ్రా యూనివర్శిటీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.…
- శ్రీశైలం ఘాట్ రోడ్డులో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరుస సెలవులతో పాటు కార్తీక మాసం ముగుస్తుండటంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ మేరకు వాహనాల…
- మద్యం మత్తులో మందుబాబు … ట్రాఫిక్ పోలీసులకు చుక్కలుహైదరాబాద్ లోని చంపాపేట్‌లో శనివారం రాత్రి మద్యం సేవించి ఓ వ్యక్తి స్కూటీపై వచ్చాడు. చెకింగ్ చేస్తున్న మీర్‌చౌక్ పోలీసులు అతన్ని ఆపారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం మత్తులో ఉన్నట్లు నిర్దారించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు డ్రంకెన్…
- చివరి దశకు చేరుకున్న సమగ్ర కుటుంబ సర్వేసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాంచీ నుంచి సమగ్ర కుటుంబ సర్వేపై జిల్లా కలెక్టర్లతో…
- రేపు సీఎంగా సోరెన్ ప్రమాణ స్వీకారం…జార్ఖండ్‌లో మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నెల 28న హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇండియా కూటమి ఎమ్మెల్యేల సమావేశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి