లక్నో వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్(Match)లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) సునాయాస విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. లక్నో బ్యాటర్లలో స్టొయినిస్ 62 పరుగులతో రాణించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 28, దీపక్ హూడా 18 పరుగులతో పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. తుషార, నబీ, కోయెట్జీ తలో వికెట్ తీశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కి దిగిన ఎంఐ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నెహాల్ వధేరా 46, ఇషాన్ కిషన్ 32, టీమ్ డేవిడ్ 35 పరుగులు చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ 4, తిలక్ వర్మ 7, సూర్యకుమార్ యాదవ్ 10… స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 2, నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, స్టొయినిస్ తలో వికెట్ పడగొట్టారు. లక్నో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీలో కీలక పాత్ర పోషించిన స్టొయినిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. పాయింట్ల పట్టికలో లక్నో మూడో స్థానానికి ఎగబాకింది. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.
- తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటుతిరుమల లడ్డూ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే సిట్ ఏర్పాటుపై తాజాగా జీవో విడుదల చేసింది. ఈ సిట్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి పని చేయనున్నారు. సభ్యులుగా గోపీనాథ్ జట్టి, హర్షవర్ధన్ రాజు, వెంకట్రావు,…
- క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్భారత జట్టు బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ధావన్ సోషల్ మీడియాలో వీడియో ద్వారా పోస్ట్ చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్టులో…
- రష్యాలో భారీ భూకంపంరష్యాలో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో భయంతో జనం రోడ్లపైకి పరుగులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.