పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం బట్రూపాలెం గ్రామంలో వేంచిసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేనీ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా యరపతినేనికి ఆలయ అర్చకులు, కమిటి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం యరపతినేని. శ్రీనివాసరావు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో యరపతినేని మాట్లాడుతూ గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసామని ముఖ్యంగా పుష్కరాలు సమయంలో ఘాటును నిర్మించి అభివృద్ధి చేశామని వారు తెలిపారు. కమిటీ సభ్యులు నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి రేపు అధికారంలోకి రాగానే ప్రభుత్వం నుండి 10 లక్షలు గ్రాంట్ ని శాంక్షన్ చేయిస్తామని వారు తెలిపారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, ఈ పల్నాడు ప్రాంత ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం..
99
previous post