గుంటూరు, యరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం లో మాట్లాడుతూ 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల సమరభేరి జరగబోతోంది. వ్యవస్థలన్ని నాశనం చేసి, అంబేద్కర్ రాజ్యాంగం వదిలేసి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఒకే ఒక్కడు చంద్రబాబు. సొంత కంపనీ లో తయారు చేసిన లిక్కర్ అమ్మితే కొన్ని లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. జగన్ మోహన్ రెడ్డి కి అధికార దాహం, దనదాహం ఉంది. రాష్ట్రంలో పేదవాడు బ్రతికే పరిస్థితి లేకుండా చేసిన జగన్. వ్యవసాయం పూర్తిగా దెబ్బతీశారు. రాష్ట్రంలో రోడ్డున పడ్డ తుపాను బాధిత రైతులను ఆదుకొని పరిస్థితి. తన మేనిపేస్టులో అమరవతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్. జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా పెట్టి టీడీపీ, జనసేనపార్టీ మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. SC, ST, మైనార్టీలను ఓటు బ్యాంకు గా వాడుతున్నారు. అవినీతి పుత్రిక సాక్షి పత్రిక. పరపతి తగ్గిన యరపతినేని పార్టీ మారే అవకాశం ఉందని తప్పుడు విష ప్రచారం చేస్తోంది సాక్షి పత్రిక. వైసీపీ పార్టీ ఒక మాఫియా పార్టీ. రాష్ట్రం బాగుండాలి పేద ప్రజలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు చంద్రబాబు, లోకేష్. పులివెందుల పోయిన పిల్లి పరదాలు కట్టుకొని తిరుగుతుంది. గురజాల నియోజకవర్గం లో విచ్చల విడిగా ఆక్రమ మైనింగ్ చేస్తున్న కాసు మహేష్ రెడ్డి. రాబోయే రోజుల్లో 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం జగన్ మోహన్ రెడ్డిని సమాజం నుండి వెలివేస్తారు. టీడీపీ, జనసేనపార్టీ కి చెందిన వారు రాబోయే ఎన్నికల్లో గెలుపుకు సిద్ధమయ్యారు. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలి.
yarapathineni srinivasa rao
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం బట్రూపాలెం గ్రామంలో వేంచిసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేనీ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా యరపతినేనికి ఆలయ అర్చకులు, కమిటి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం యరపతినేని. శ్రీనివాసరావు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో యరపతినేని మాట్లాడుతూ గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసామని ముఖ్యంగా పుష్కరాలు సమయంలో ఘాటును నిర్మించి అభివృద్ధి చేశామని వారు తెలిపారు. కమిటీ సభ్యులు నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి రేపు అధికారంలోకి రాగానే ప్రభుత్వం నుండి 10 లక్షలు గ్రాంట్ ని శాంక్షన్ చేయిస్తామని వారు తెలిపారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, ఈ పల్నాడు ప్రాంత ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.




Total views : 78848