కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్వర్యంలో విజయవాడలో డిసెంబర్ 10 న జరిగే రాష్ట్ర మహసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా జెఏసి ఛైర్మన్ కామల చంద్ర శేఖర్, వైస్ చైర్మన్ యం రామమూర్తి నాయక్, జనరల్ సెక్రెటరీ నాగరాజు, జాయింట్ సెక్రెటరీ పద్మనాభంలు. రాయచోటిలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు, సభ్యులతో కలిసి రాష్ట్ర మహాసభ కార్యాచరణ సమావేశంను మహిళా సమాఖ్య కేంద్రంలో నిర్వహించారు. మహాసభకు సంబందించి పోస్టర్లను కూడా వారు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా లోని ఏడు నియోజకవర్గాల్లో 31 మండలాల్లో గాను మా కమిటీ సభ్యులు అందరూ 27 మండలాలు తిరిగి ప్రతి ఒక్క ఔట్సోర్సింగ్ ఉద్యోగిని మోటివేషన్ చేసుకుంటూ మహాసభ జయప్రదం చేయాలని చెప్పడం జరిగింది. అలాగే వేలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలను రద్దు చేసి అప్కాస్ అనే సంస్థ ద్వారా ఉద్యోగ భద్రతను కల్పించిన ప్రత్యేకమైన సిఎం జగన్ మోహన్ రెడ్డి గారికి అన్నమయ్య జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తరఫున మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఎపి జెఏసి అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, కార్యదర్శి సుమన్,జనరల్ సెక్రెటరీ అల్లం సురేష్ అధ్వర్యంలో దీనికి అనుబంధంగా ఉన్నటువంటి 94 సంస్థలు కూడా మనకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయన్నారు. మనమందరం ఏకతాటిగ మన సంఖ్యా బలాన్ని నిరూపించుకోవాల్సిన అవశ్యక్తత ఎంతైనా ఉందన్నారు. అన్నమయ్య జిల్లా నుంచి ఏడు బస్సులతో పాటు నాలుగు కార్లు, రెండు మిని బస్సుల తో మహాసభకు వెళ్లేలా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం తమకు రూ.3000 రూపాయల వేతనం నుండి ఏ స్థాయి పనిని అప్పగించినప్పటికి ఆ పనిని నిర్వర్తించేందుకు మేము ఏనాడు కూడా వెనకడుగు వెలయలేదన్నారు. ప్రస్తుతం చేస్తున్న పనికి వచ్చెటువంటి వేతనాలు సరిపడక ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారాన్నరు. మాకు ప్రభుత్వం మా యొక్క విన్నపాలను ఆలకించి వేతనాలు పెంచడంతో పాటు సర్వీస్ రూల్స్ ను వర్తింప జేస్తు సెలవులను కూడా కేటాయించాలి. అదే విధంగా జగనన్న నవరత్నాలు కూడా మాకు వర్తింపజేసెలా అవకాశం కల్పించాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్లని వారు ఈ సందర్బంగా తెలియజేశారు. అదే విధంగా ఈ యొక్క మహా సభ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి తో పాటు మాలద్రి విష్ణు గారు కుడా హాజరవుతారని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ బి నాగరాజు, జాయింట్ సెక్రటరీ టి పద్మనాభం, సభ్యులు ఏ శాంతి, యం జేమ్స్ పాల్, రెడ్డప్ప, బి కళ్యాణ్ కుమార్ రెడ్డి, శంకరయ్య, శ్రీను, పవన్ కుమార్ హాజరయ్యారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ..
75
previous post