బొగ్గు గనుల ఆకస్మిక తనిఖీ…

Sudden Inspection of Coal Mines...

Advertisements

&NewLine;<p>సింగరేణి కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని&comma; కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సంస్థ సి అండ్ ఎండి బలరాం అన్నారు&period; పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా సింగరేణి బొగ్గుగనులను అర్జీ 1 జిఎం శ్రీనివాస్ తో కలిసి సందర్శించారు&period; ఓసిపి 3 ప్రాజెక్ట్ తో పాటు జిడికే 2వ బొగ్గు గనిలో పని స్థలంలోకి వెళ్లి కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు&period; రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని కార్మికులకు సూచించారు&period; కార్మిక కుటుంబాలకు తాగునీటితో పాటు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపడుతన్నట్లు పేర్కొన్నారు&period; కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు&period; అలాగే కార్మిక కుటుంబాలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.