ఏపీలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బురిలంక రేవు వద్ద ఇసుక తవ్వకాలను బీజేపీ, జనసేన నేతలతో కలిసి పురందేశ్వరి పరిశీలించారు. అనంతరం అక్కడి నర్సరీ రైతులు ఇసుక అక్రమాలను బీజేపీ, జనసేన నేతలకు వివరించారు. దశాబ్దాలుగా ఇలాంటి ఇసుక దందా చూడలేదని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలో ఇసుక సరఫరా దోచుకో, దాచుకో అనే తీరుగా మారిందని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేపీ సంస్థ ముసుగులో ఇసుక దందా కొనసాగుతోందని విమర్శించారు. ఇసుక దందా సొమ్మంతా తాడేపల్లికి చేరుతోందని ధ్వజమెత్తారు. నదీ గర్భంలో యంత్రాలతో తవ్వకాలు చేపట్టవద్దని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఇక్కడ ఇసుక తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు మే నెలతో పూర్తి అయ్యాయని, అయినా ఇష్టానుసార ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని పురందేశ్వరి మండిపడ్డారు.
ఏపీలో ఇసుక సరఫరా దోచుకో, దాచుకో అనే తీరుగా మారింది
72
previous post