సూర్యజయంతి(Surya Jayanthi) వేడుకలు
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఉదయం 4.30 నిమిషాలకే సూర్య జయంతి వేడుకలు ప్రారంభం అయ్యాయి. రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయన్నీ దివ్యాంగసుందరంగా అలంకరించారు టీటీడీ గార్డెన్(TTD Gardens) సిబ్బంది. దేశీవాలి సంప్రదాయ పుష్పాలతో పాటుగా., దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రకాల కట్ ఫ్లవర్స్., ఆలయంలో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగగా అలంకరించగా. ఆలయ మహా గోపురంతో పాటు తిరుమలలోని కూడళ్లలో విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. వివిధ రకాల అరుదైన పుష్పాలతో పాటు పలు రకాల పండ్లతో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు టీటీడి ఉద్యానవణ సిబ్బంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
శ్రీవారి ఆలయ మహా గోపురంతో పాటు ఆలయం లోపల ధ్వజస్తంభాని వివిధ రకాల పుష్పాలతో అత్యంత శోభాయిమానంగా ఆలంకరించారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఈ పుష్పాలంకరణ అదనపు ఆకర్షణ నిలిచింది. రంగు రంగు పుష్పాలతో ఎటు చూసిన పూల తోరణలు, కట్ అవుట్ లు,బొకేలతో చేసిన అలంకరణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తొంది. ఓ వైపు పుష్ప అలంకరణ భక్తులను మంత్రముగ్దులను చేస్తుండగా. విద్యుత్ అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రధాన గోపురంతో పాటు ప్రకారం, ఆలయం లోపల, వెలుపల, విద్యుత్ దీప వెలుగులతో దేదీపమాన్యంగా వెలిగిపోతుంది. ఇక రథసప్తమికి ప్రతీకగా ఆలయం ముందు శ్రీ మలయప్ప స్వామి వారి ఫ్లెక్సీలతో పాటుగా. సర్వ భూపాల., చంద్రప్రభ., సూర్యప్రభ., చిన్న శేష వాహనాలపై విహరిస్తున్న స్వామి వారి చిత్రపటాలు ఏర్పాటు చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.