టీ20లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav

Advertisements

&NewLine;<p>దక్షిణాఫ్రికాపై 3à°µ టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణ రికార్డులు నెలకొల్పాడు&period; అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో నాలుగు సెంచరీలు సాధించిన మూడవ బ్యాట్స్‌మెన్‌గా మిస్టర్ 360 గా నిలిచాడు&period; ఈ జాబితాలో చెరో 4 సెంచరీలతో ఉన్న రోహిత్ శర్మ&comma; గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ సరసన నిలిచాడు&period; అయితే సూర్య కేవలం 57 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును సాధించగా రోహిత్ 79 మ్యాచ్‌లు&comma; మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్ ఆడడం గమనార్హం&period; దీనినిబట్టి సూర్య ఎంత వేగంగా 4 సెంచరీలను అందుకున్నాడో అర్థమవుతోంది&period; ఇక టీ20 ఫార్మాట్‌లో వీళ్లు ముగ్గురు మాత్రమే 4 చొప్పున సెంచరీలు నమోదు చేయగా సబావూన్ డేవిజి 3&comma; కోలిన్ మన్రో 3&comma; బాబర్ ఆజం 3 ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు&period; దక్షిణాఫ్రికాపై సూపర్ సెంచరీ సాధించిన సూర్య ఖాతాలో మరో రెండు రికార్డులు పడ్డాయి&period; టీ20లలో అత్యధిక స్కోరు సాధించిన మూడవ భారత కెప్టెన్‌గా సూర్య నిలిచాడు&period; ఇక సూర్య సాధించిన నాలుగు సెంచరీలు వేర్వేరు దేశాల్లో నమోదు చేయడం మరో రికార్డుగా ఉంది&period; ఇంగ్లాండ్&comma; న్యూజిలాండ్&comma; ఇండియా&comma; తాజాగా దక్షిణాఫ్రికాలో సెంచరీలు బాదాడు&period; ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా మిస్టర్ 360 గా నిలిచాడు&period; మాక్స్‌వెల్ సెంచరీల్లో రెండు భారత్‌లో&comma; శ్రీలంక&comma; ఆస్ట్రేలియాల్లో ఒక్కోటి చొప్పున బాదాడు&period; ఇక రోహిత్ ఇండియాలో 3&comma; ఇంగ్లండ్‌లో ఒక సెంచరీ కొట్టాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..