తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఏపీ ఎతిక్స్ కమిటీ ఛైర్మన్ మురుగుడు హనుమంతరావు విడివిడిగా శ్రీవారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు
#AndhraPradesh #
నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్ సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్ అన్నారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది. వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో కీలకంగా మారిన టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయించారు. పోలీసుల నిర్ణయానికి రాష్ట్ర హోం శాఖ అంగీకరించడంతో కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ఫైబర్ నెట్ టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టినట్టు సీఐడీ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, సంస్థకు చెందిన పలు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ భావించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు హోం శాఖ ఆమోదం తెలిపింది. పోలీసులు అటాచ్ చేయదలిచిన ఆస్తుల్లో గుంటూరులోని ఓ ఇంటి స్థలం, విశాఖపట్నంలోకి ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లో నాలుగు ప్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది. ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోసం సీఐడీ పోలీసులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. “స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు” పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఉత్సవాలకు మంత్రులు రోజా, ఉషాశ్రీచరణ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గుంటూరులో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు. హాజరై చిందులు వేశారు. సీఎం జగన్ మాస్కులతో జగన్ వల్లే విద్య అంటూ ఫ్లకార్డులు ప్రదర్శన చేశారు. మంచి నీళ్ళు ఇవ్వలేదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తంచేశారు. మార్కెట్ కూడలి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు అక్కడ నుంచి విద్యార్థులను పంపిచివేసారు.
శ్రీకాకుళం జిల్లాలలో కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. ఇచ్చాపురం నియోజకవర్గం లోని మండలాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. కంచిలి మండలంలోని మండపల్లి గ్రామంలో ఒక ఆవుల శాలపై పెద్దపులి దాడి చేసి ఒక ఆవును చంపింది. ఉదయం రైతు వచ్చి చూడగా ఒక ఆవు కనిపించడం లేదని గుర్తించాడు. ఆవు కోసం వెతికి చూడగా 100 మీటర్ల దూరంలో చనిపోయిన ఆవు కనిపించింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. సమాచారం అందిస్తే గాని ఫారెస్ట్ అధికారులు రాకపోవడం, పెద్దపులి భారీ నుంచి ప్రజలను కాపాడే చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్న అటవీ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకునే క్రమంలో అడుగడుగునా నీరాజనాలు పలికారు. ముఖ్యంగా విజయవాడలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. రాత్రి 3.30 గంటల సమయంలో ఆయన కాన్వాయ్ రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. అప్పటికే ఎదురుచూస్తున్న అభిమానులు ఆయనను చూడగానే ఒక్కసారిగా కేరింతలు కొడుతూ రోడ్లపైకి వచ్చారు. ‘జై చంద్రబాబు, జై తెలుగుదేశం’ అంటూ నినాదాలతో మారుమోగించారు. విజయవాడ నిర్మలా కాన్వెంట్, బెంజి సర్కిల్ పరిసరాలు జైచంద్రబాబు నినాదాలతో దద్దరిల్లాయి. కనకదుర్గ వారధి, తాడేపల్లి, ఉండవల్లి సెంటర్లలో చంద్రబాబు రాకకోసం జనం గంటల తరబడి ఎదురుచూశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా తెల్లవారుజామున సైతం విజయవాడ నగర ప్రజలు చంద్రబాబును చూసేందుకు గంటల తరబడి నిరీక్షించారు. తెల్లవారుజామున 4.45 గంటలకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్‌కు చేరుకున్న చంద్రబాబునాయుడు కాన్వాయ్కి అపూర్వస్వాగతం లభించింది. విజయవాడ నగరానికి చెందిన వేలాదిమంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. పెల్లుబుకిన ఆనందంతో మహిళలు హారతులు ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, నెట్టెం రఘురామ్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, నాగుల్ మీరా, కేశినేని చిన్ని, ఇతర ముఖ్యనేతలు అధినేతకు ఘనస్వాగతం పలికారు. కాగా మంగళవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో రాజమండ్రి నుండి చంద్రబాబు బయలుదేరారు. అభిమానుల తాకిడి ప్రభావంతో ఆయన సుధీర్ఘ నిర్విరామ ప్రయాణం చేయాల్సి వచ్చింది. మధ్యంతర బెయిల్‌కు సంబంధించి కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు కారు లోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సిన కాన్వాయ్‌ను పోలీసులు బందరురోడ్డు, ఫైర్ స్టేషన్, వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లి వెళ్లేవిధంగా దారిమళ్లించారు.మధ్యంతర బెయిల్‌కు సంబంధించి కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు కారు లోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సిన కాన్వాయ్‌ను పోలీసులు బందరురోడ్డు, ఫైర్ స్టేషన్, వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లి వెళ్లేవిధంగా దారిమళ్లించారు.
చంద్రబాబుకు కండీషనల్ బెయిల్ మాత్రమే ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్ రాగానే టీడీపీ సంబరాలు జరుపుకోవడంలో అర్థం లేదని మండిపడ్డారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను విచారిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయిని తెలిపారు. మధ్యంతర బెయిల్ రాగానే నిజం గెలిచినట్టా అని సజ్జల ప్రశ్నించారు. బెయిల్ రాగానే నిజం ఎక్కడ గెలిచినట్లు అని… ఇది విజయోత్సవాలు జరుపాల్సిన సందర్భమేనా అంటూ ప్రశ్నించారు. చికిత్స చేయించుకోవడానికి మాత్రమే చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు. చంద్రబాబు జైలులో ఉన్నా .. బయట ఉన్నా ఒకటే అని వ్యాఖ్యానించారు. చిన్న వ్యాధిని కూడా పెద్దగా చూపించి … సానుభూతి పొందే ప్రయత్నం చస్తున్నారని అన్నారు. నిజంగా చంద్రబాబు అనారోగ్యంగా ఉంటే చికిత్స చేయించుకోవాలని అన్నారు. చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందేనని చెప్పారు.
ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఎట్టకేలకు దాదాపు 53 రోజుల తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయ్యింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ కోరడంతో ఏపీ హైకోర్ట్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు అనుమతి ఇచ్చింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 10వ తేదీ ఉదయం ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం 10 అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు. గత 53 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎయిర్ పోర్టుకు వరకు చంద్రబాబుకు భారీ ఊరేగింపుతో స్వాగతం పలకాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబును తీసుకువెళ్ళి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో చికిత్స చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబుకు అధికారులు ఎన్ఎస్జీల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ , ఆయన సతీమణి బ్రాహ్మణి రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయిన విషయాన్ని లోకేష్ వద్ద నాయకులు ప్రస్తావించారు. యుద్ధం ఇప్పుడు ప్రారంభం అయ్యిందని నాయకులు, కార్యకర్తలతో లోకేష్ అన్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఇంటింటికి ప్రచారంలో భాగంగా ,శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ నుండి నగరం నడిబొడ్డులోని సదా శివ టవర్స్ వేదిక వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ కోట వినుత మరియు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు. ఇంటింటికి ప్రచారం అనే నినాదంతో వైయస్సార్సీపి చేసిన అవకతవకల పనులన్నీ ప్రజలకు తెలియజేస్తామని, వైయస్సార్సీపి పార్టీకి చివరి రోజులు గడుస్తున్నాయని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి జనసేన పార్టీ – తెలుగుదేశం కలయికతో విజయం సాధిస్తామని కోట వినుత తెలిపారు.