ఎన్టీఆర్ జిల్లా మిచౌంగ్ తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధం. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు, మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు. ఈ కేంద్రం నుంచి తుఫాన్ పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు. జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు అత్యవసర సహాయం, వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ 0866- 2575833లో సంప్రదించాలని తెలిపారు.
cyclone michaung update
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడటంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే పరిస్థితి వున్న దృష్ట్యా సోమవారం 4.12.2023 ఒకరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటిస్తున్నట్లు పశ్చిమ గోదావరిజిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వులను తూ.చా తప్పకుండా పాటించవలసిందిగా ఆ ప్రకటనలో ఆదేశించడం అయినది.
నెల్లూరుకు 250 కి.మీ, దూరంలో కేంద్రీకృతమై ఉన్న మీచౌంగ్ తుఫాన్…గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను. రేపు మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచౌంగ్ తుఫాన్. తీవ్రవాయుగుండం కారణంగా శనివారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా నమోదు కురుస్తున్న భారీ వర్షాలు. తీరం దాటే సమయంలో గంటకు 80 -100 కీమీ వేగంతో గాలులు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక…. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్న నెల్లూరు జిల్లా యంత్రాంగం. ఇప్పటికే నెల్లూరు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు. మీచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో కోవూరు నియోజవర్గంలో పలు మండలాల్లో ఈదురుగాలితో కూడిన బారి వర్షం. కురుస్తున్న వర్షం దాటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు పలు మండలాల్లో కరెంట్ అంతరాయం.





Total views : 79347