తిరుపతిలో రాయలసీమ అభివృద్ధి సమస్యలపై చర్చాగోష్టి, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో సమావేశం. రాష్ట్ర విభజన హామీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేయలేదని డా.ఎన్.తులసిరెడ్డి, ఏపీసీసీ మీడియా కమిటీ రాష్ట్ర ఛైర్మన్ అన్నారు. మౌళిక సదుపాయాలు, ముడిసరుకు ఉన్నా కడపకు స్టీల్ ప్లాంట్ నిర్మాణం అమలు కాదని తేల్చారు. మన్నవరం ప్రాజెక్టు ను మూసివేశారని, కడప – బెంగుళూరు బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ను యూపీఏ ప్రభుత్వం మొదలెట్టినా..వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో నిలిచిపోయిందని అన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఏకంగా కడప – బెంగుళూరు రైల్వే లైన్ అవసరం లేదని కేంద్రానికి లేఖ రాశారని, వైఎస్సార్ సిఎంగా రైల్వే లైన్ క్లియర్ చేయిస్తే కుమారుడు జగన్మోహన్ రెడ్డి రద్దు చేయించారని అన్నారు. చంద్రబాబు సిఎంగా ఉండగా రాజధాని, హైకోర్టు రెండూ అమరావతిలో నిర్మించినా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారని, రాయలసీమకు హైకోర్టు తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదని ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతిని విశాఖకు తరలిస్తే నష్టపోయేది రాయలసీమ వాసులేనని, కృష్ణానది యాజమాన్యం బోర్డు విశాఖలో పెట్టాలని సిఎం జగన్మోహన్ రెడ్డి యాజమాన్య బోర్డుకు లేఖ రాశారని, రాయలసీమలో కృష్ణానది బోర్డు ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నామని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే నష్టపోయేది సీమ వాసులేనని, సీమలో డ్రిప్ ఇరిగేషన్ అమలుకు డిమాండ్ చేస్తున్నామన్నారు.
Tdp
కాకినాడ జిల్లా తునిలో యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ నాయకుడు నారా లోకేష్ అక్కడి మత్యకారులతో మాట్లాడుతూ… మత్యకారులకు నాడు చంద్రబాబు ఎంతో మేలు చేస్తే.. నేడు సైకో జగన్ ప్రభుత్వం అన్నీ రద్దు చేసిందని ఆయన అన్నారు. మత్స్యకారుల తరపున బహిరంగ చర్చకు నేను సిద్ధమని, మత్యకార మంత్రి అప్పలరాజు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలోకి వచ్బిన వంద రోజుల్లోపు జీవో 217 రద్దు చేస్తామని, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని ఆయన అన్నారు. కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాల వల్ల మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక పొల్యూషన్ లేని కంపెనీలు తీసుకువస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల కేంద్రంలో తెలుగు తమ్ముళ్ల మధ్య పెక్సీల వివాదం. ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా తెలుగు తమ్ముళ్లు పెక్సీలు కట్టే విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి మాది సెంటర్లో ఉండాలి, మాది సెంటర్లో ఉండాలని ఘర్షణకు దిగిన తెలుగు తమ్ముళ్లు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదల కొట్టడంతో సమసిపోయిన వివాదం.
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించి, పంట పొలాలు పరిశీలిస్తారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ.. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా తీవ్రంగా నష్టపోయింది. బాపట్ల పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైంది, వర్షపునీరు మురుగునీరు ఎక్కడికక్కడే ఆగిపోయింది. బాపట్ల మండలం భర్తిపూడి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శిలా విగ్రహం తలను పగలకొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిరికి పందల చర్య, విగ్రహం ధ్వంసం చేసిన వారిని తక్షణమే శిక్షించాలి. తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చెందేలా చేసిన నాయకులు నందమూరి తారక రామారావు, సంస్కార లేని వైసిపి మూకలు చేసిన దుశ్చర్య గా భావిస్తున్నాం . కూడు, గూడు, గుడ్డ సామాన్యుడి కి అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఎవరేమనుకున్నా సరే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే అల్లరి మూకల ఆటకట్టిస్తాం.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఆయన రేపు సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచింది. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ సీఎం కావాలని అధిష్ఠానానికి సూచించారు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం అభ్యర్థిపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాజకీయ జీవిత ప్రయాణం గురించి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. 1969 – నవంబరు 8న నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో జననం, 2006 – మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్, 2014–17 మధ్య టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా, 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిక. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి. 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం. 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ నియామకం, 2021 జులై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం. 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాష్ట్రంపై ‘మిచాంగ్’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని… ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా… ప్రభుత్వం తగు రీతిలో స్పందించలేదని అన్నారు. ధాన్యం కొనుగోలులో రకరకాల ఆంక్షలతో ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారని… సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని… ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలని అన్నారు. తుఫాన్ బాధిత ప్రజల కోసం షెల్టర్లు, అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. మరో వైపు మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో చంద్రబాబు శ్రీశైలం పర్యటనను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆయన శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. అయితే తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత దర్శించుకోవాలని అధినేత నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా వుంచితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ లభించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలోని దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఈ మధ్యే తిరుమలలో శ్రీవారిని, విజయవాడలో కనకదుర్గమ్మ, సింహాచలంలో అప్పన్నను దర్శించుకున్నారు. త్వరలోనే శ్రీశైలం మల్లన్నతోపాటు కడప దర్గా, మేరీమాత చర్చిలను ఆయన సందర్శించనున్నారు. కాగా ఆలయాల సందర్శనకు వెళ్తున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతాలు పలుకుతున్నాయి. భారీ ర్యాలీలతో అధినేతకు మద్దతుగా నిలుస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజార్టీ సాధించింది. ఈ సాయంత్రం కాంగ్రెస్ సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ శ్రేణులు మద్దతుగా నిలిచాయనే వార్తలు వినిపించాయి. గాంధీభవన్ వద్ద కూడా టీడీపీ జెండాలు ఎగిరాయి. ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఎల్లో మీడియా ‘స్వీయ సంతృప్తి’ పొందుతోందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో పోటీ చేయకుండా ముఖం చాటేసిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఈయన ఒక మర్చిపోయిన జ్ఞాపకం అని అన్నారు. కాంగ్రెస్ గెలుపుకు ఈయన కారణమవుతారా? అని ప్రశ్నించారు. నిజంగా తన పాత్ర ఉంటే అదెలాగో ఎల్లో మీడియా స్పష్టం చేయాలని సవాల్ విసిరారు.
పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగిన పరిణామాలతో ముఖ్యమంత్రి జగన్కు భయం పట్టుకుందని, అసెంబ్లీ ఫలితాలను చూసి ఆయనకు మైండ్ బ్లాంక్ అయిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముందు ముందు తన పరిస్థితి ఏమిటోనని ఆయన భయపడుతున్నారన్నారు. అందుకే రాష్ట్రాన్ని తుఫాన్ కమ్మేసినా బయటకు రావడం లేదని విమర్శించారు. ప్రచండ వేగంతో మిగ్జాం తుఫాన్ రాష్ట్రాన్ని కమ్మేస్తోందని, ఈ సమయంలో రైతులు, మత్స్యకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? అని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న అభినవ నీరోచక్రవర్తి జగన్ అని దుయ్యబట్టారు. ఆయన అసమర్థత కారణంగా రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదని, విలాసాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, టిడిపి నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి మారిన నేతలకు ప్రజలు ఝలక్ ఇచ్చారు భారీ ఆశలతో బీఆర్ఎస్లో చేరిన వారికి భంగపాటు తప్పలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి నుంచి గెలిచి పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర రావు, పినపాకలో రేగా కాంతారావు ఓటమి పాలయ్యారు. ఇల్లెందులో హరిప్రియ, నకిరేకల్ లో చిరుమర్తి లింగయ్య కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన భూపాలపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డికి కూడా పరాజయం తప్పలేదు. అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు, పాలేరులో ఉపేందర్ రెడ్డి, ఎల్లారెడ్డిలో సురేందర్, కొల్లాపూర్ లో హర్షవర్థన్ ఘోరంగా ఓటమి చెందారు. పార్టీ మారిన వారికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు.
Read Also..
Read Also..
మచిలీపట్నంలో వైసీపీ, టీడీపీ నేతల మాటలతో బందరు రాజకీయం రసవత్తరంగా మారింది.మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఏమ్మెల్యే పేర్ని నానిపై తీవ్రస్తాయిలో విమర్శలు చేసారు. బందరు ని గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం ,కమిషన్ల కోసం, గాలి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. పోర్టు నిర్మాణం పై ఎంత పని జరిగిందో స్వేతపత్రం విడుదల చేస్తారా అనీ డిమాండ్ చేసారు.ఇసుకని యదేచ్చగా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలు తనను గెలిపిస్తే కొడుకుకి అధికారం ఇచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.