సికింద్రాబాద్ నియోజకవర్గంలో రెండవ రౌండ్ పూర్తయ్యేవరకు BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ ఆధిక్యంలో ఉన్నారు. BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ కు రెండవ రౌండ్ లో బీఆర్ఎస్ 5228 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణి కి 1399 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి ఆదం సంతోష్ కు 2615 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు BRS అభ్యర్థి పద్మారావు 6544 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
telanagana election
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధం
12 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కు ఐదు ప్రాంతాల్లో ఏర్పాట్లు
1- వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో 5 నియోజకవర్గాల లెక్కింపు -వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కోసం 23 టేబుల్స్ ఏర్పాటు.
14 టేబుల్ లలో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరగనుండగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 9 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 24 రౌండ్ లలో లెక్కింపు పూర్తవుతుంది.
పరకాల, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల ఓట్లు లెక్కింపు కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి 17 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరగనుండగా మూడు టేబుల్స్ లో పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు జరగనుంది.
2- ములుగు కలెక్టర్ కార్యాలయం అవరణలో ములుగు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు.
మొత్తం 17 టేబుల్స్ ఏర్పాటు చేయగా 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. 22 రౌండ్ల తర్వాత తుది ఫలితం వస్తుంది.
3- భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియం పక్కన ఉన్న సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో భూపాలపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు.
మొత్తం 17 టేబుల్స్ ఏర్పాటు చేయగా 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. 23 రౌండ్ల లో లెక్కింపు పూర్తవుతుంది.
4- జనగామ పెంబర్తి వీబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు
(జనగామ, స్టేషన్గన్పూర్, పాలకుర్తి)
ఒక్కొక్క నియోజకవర్గానికి 17 టేబుల్ ఏర్పాటు. 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు, మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. 18 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.
5- మహబూబాద్ టౌన్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల భవనంలో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓటరు తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనున్నది. పటిష్ట బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటలకే అధికారులు లెక్కింపు కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానున్నది. నగరంలో తొలి ఫలితం చార్మినార్ నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉండగా, చివరి ఫలితం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వెల్లడికావచ్చు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
భద్రాది కొత్తగూడెం జిల్లా, ఉదయం 7.00 నుండి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పాల్వంచా లోని అనుబోసే ఇంజినీరింగ్ కళాశాలో ఏర్పాటు చేశారు.
1)పినపాక నియోజకవర్గం 110 :-
మొత్తం ఓట్లు: 1,98,402
పోలైన ఓట్లు: 1,58,978
పోలింగ్ శాతం :80.13%
పోలింగ్ బూత్ ల సంఖ్య : 244
కౌంటింగ్ రౌండ్లు :18
2)ఇల్లందు నియోజకవర్గం 111:-
మొత్తం ఓట్లు: 2,19,569
పోలైన ఓట్లు: 1,76,840
పోలింగ్ బూత్ ల సంఖ్య : 241
పోలింగ్ శాతం :80.54%
కౌంటింగ్ రౌండ్లు:18
3)కొత్తగూడెం నియోజకవర్గం 117:-
మొత్తం ఓట్లు: 2,43,846
పోలైన ఓట్లు: 1,86,347
పోలింగ్ బూత్ ల సంఖ్య : 253
పోలింగ్ శాతం : 76.42%
కౌంటింగ్ రౌండ్లు:19
4)అశ్వారావుపేట నియోజకవర్గం 118:-
మొత్తం ఓట్లు: 1,55,961
పోలైన ఓట్లు: 1,35,501
పోలింగ్ బూత్ ల సంఖ్య : 184
పోలింగ్ శాతం :86.88%
కౌంటింగ్ రౌండ్లు: 14
5)భద్రాచలం నియోజకవర్గం119:-
మొత్తం ఓట్లు: 1,48,661
పోలైన ఓట్లు:1,17,447
పోలింగ్ బూత్ ల సంఖ్య : 176
పోలింగ్ శాతం :79%
కౌంటింగ్ రౌండ్లు: 13
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మొత్తం
పోలింగ్ బూత్ ల సంఖ్య : 1,098
జిల్లా లో పోలింగ్ ప్రదేశాలు : 701
జిల్లా లో సమస్యాత్మక కేంద్రాలు :320
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఓటర్లు:-
మొత్తం ఓట్ల సంఖ్య : 9,66,439.
మొత్తం పోలైన ఓట్లు :7,75,113.
మొత్తం పోలైన ఓట్ల శాతం :80.20%
మొత్తం కౌంటింగ్ రౌండ్లు: 82.
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కొరకు
బ్యాలెట్ యూనిట్లు:2435
కంట్రోల్ యూనిట్లు :1790
వివిప్యాడ్లు :1777
ఎన్నికల్లో వినియోగించారు..
నేడే ఉత్క్కంటకు తెర, నేడు ప్రజా తీర్పు తెలనున్న అభ్యర్థుల భవితవ్యం.
నాలుగు జిల్లాలో పది నియోజకవర్గాలు లెక్కింపు. ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు. 289 పోలింగ్ కేంద్రాలు, 21రౌండ్లు…….!
హాజీపూర్ మండలం ముల్కల్లలోని ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల ఓట్లు అదే కళాశాల భవనంలో లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రంలో భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ గదుల తలుపులకు ట్రిపుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 144 సెక్షన్ విదించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తాజాగా ఓట్ల లెక్కింపు కేంద్రాలపై స్పష్టత వచ్చింది. డిసెంబర్ 3న నిర్వహించనున్న కౌంటింగ్ కోసం గ్రేటర్ పరిధిలో మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించగా.. ఒక్క హైదరాబాద్ లోనే మొత్తం 14 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. ఇందులో భాగంగానే ఏర్పాట్లను శరవేగంగా పూర్తిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో 4, మిగిలిన జిల్లాల్లో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమై ఉన్నామని తెలిపారు.





Total views : 149986