ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. మొన్నటి వరకు ఉనికిని కోల్పోయినట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాక కొత్త హుషారును నింపింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను ఆమె ప్రధాన అస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆమె తన రాజకీయాన్ని ఢిల్లీకి మార్చారు. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆమె దీక్షకు దిగనున్నారు. ఈ దీక్ష ద్వారా ఆమె ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఎన్సీపీ అధినేత, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ను షర్మిల కలిశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై తాము చేస్తున్న పోరాటానికి మద్దతును ఇవ్వాలని పవార్ ను కోరారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని విన్నవించారు. షర్మిల విన్నపం పట్ల పవార్ సానుకూలంగా స్పందిస్తూ పార్లమెంటులో ఈ విషయంపై మాట్లాడతామని హామీ ఇచ్చారు.
YS Sharmila
వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరినందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తండ్రిపై కేసులు పెట్టి.. అన్న జగన్ను 16 నెలలు జైలులో వేసినా షర్మిల… కాంగ్రెస్ లో చేరడం సిగ్గుచేటన్నారు. షర్మిల చేస్తున్న ద్రోహానికి స్వర్గంలో ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి కూడా కంటతడి పెట్టుకుంటారని అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తు రాజుపాలెంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో నల్లపురెడ్డి పాల్గొన్నారు. జగన్ను ఓడించేందుకే వైస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. ఇందుకు భగవంతుడు కూడా ఆమెను క్షమించడన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, షర్మిలకు డిపాజిట్లు దక్కవని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో 8 కోట్ల రూపాయల ఖర్చుతో స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ నిర్మించారు. ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. వైఎస్ షర్మిల గురించి మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు పనికిరావు. కాంగ్రెస్ పార్టీని బతికించాలని ఎంతమంది ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో 2024 ఎన్నికల్లో మేము విజయం సాధించి తీరుతాం అని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంగా ఉన్నా కడపలోని స్టీల్ ప్లాంట్ ను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కడపలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. జగనన్న సొంత జిల్లానే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీకి బానిసలై వారికి మద్దతు ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ముగ్గురు వస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ కు ఓటేసినా బీజేపీ ఖాతాలోకి వెళ్లుందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారన్నారు. వైసీపీ కోసం నిస్వార్ధంగా పని చేస్తే ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా తన మార్క్ రాజకీయం, సంక్షేమ పాలన అందించారన్నారు. అదిప్పుడు జగనన్న పాలనలో ఎక్కడుంది అని ప్రశ్నించారు
అన్ని వర్గాల వారి కోసం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆయన భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని షర్మిల ఆవిష్కరించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు వందశాతం పెరిగిపోయాయని దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసినవారిని పక్కన పెట్టుకుంటున్నారని షర్మిల విమర్శించారు. అంబేడ్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదు ఆయన ఆశయాలను అమలు చేయాలని హితవు పలికారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వబోమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల కోరారు. అక్రమంగా సంపాదించుకోవడానికి నా భర్తతో జగన్ వద్దకు వెళ్లానని అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ్టి వరకూ ఏదీ ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదని, దానికి సాక్ష్యం మా అమ్మేనని మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆనవాళ్లు కనిపించడం లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు జగన్ తూట్లు పొడిచారని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి పాలనకు, జగన్ పాలనకు పొంతనే లేదన్నారు. నాన్న పేరును జగన్ పూర్తిగా చెడగొట్టాడని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశాడని అన్నారు. తనకు వ్యక్తిగతంగా నష్టం చేసినా ప్రజలకు మేలు చేస్తాడని భరించానని అయినా అలా జరగలేదన్నారు. జగన్ ఒక నియంత మాదిరి పెద్దపెద్ద కోటలు కట్టుకున్నారని షర్మిల విమర్శించారు. ఎమ్మెల్యేలకు కూడా ఆయన కనిపించరన్నారు. ఎంతో మంది కష్టపడి, త్యాగాలు చేస్తేనే జగన్ సీఎం అయ్యాడని చెప్పారు. పక్కన ఉన్న అందరినీ దూరం చేసుకుంటున్నాడని అన్నారు. వైఎస్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. జగన్ కోసం రాజీనామా చేసిన 18 మందిలో ఎంత మందిని మంత్రులను చేశాడని షర్మిల ప్రశ్నించారు.
Read Also..
Read Also..
ఎన్టీఆర్ జిల్లా, గన్నవరం నియోజకవర్గం, ఎపిసిసి చీఫ్ షర్మిలారెడ్డి ర్యాలీని అడ్డుకున్న విజయవాడ పోలీసులు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన, ఆగ్రహం. పోలీస్ తీరుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట ప్రకారమే షర్మిల రోడ్ షో అడ్డుకున్నారంటు కాంగ్రెస్ నేతలు విమర్శలు. రోడ్డుపై బైటాయింపు. ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు. కావాలనే అడ్డుకున్నారంటున్న కాంగ్రెస్ నేతలు. వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతుంది. నేను భాద్యతలు తీసుకుంటున్న ఈ సమయంలో మా కాన్వాయ్ నీ ఎందుకు ఆపారు ? మమ్మల్ని చూసి భయపడుతున్నారా సార్ ? అంటూ పోలీసులతో వాగ్వాదం. APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వాహన కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు. ఎనికే పాడు వద్ద వాహనాలను మళ్లించిన పోలీసులు. వాహనాలను డైవర్ట్ చేసేందుకు నిరసనగా రోడ్డుమీద బైఠాయించిన కాంగ్రెస్ నేతలు.
అమరావతి, నేడు పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల. 9:30 నీ లకు కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు రానున్న షర్మిల. షర్మిల ప్రమాణ స్వీకారానికి రానున్న ఏఐసిసి నేతలు మాణిక్యం టాగూర్, మునియప్పన్, కృష్టఫర్ తిలక్, ఎపిసిసి కీలక నేతలు,మాజీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కానూరు ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్ళనున్న వైఎస్ షర్మిల. కానురులో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి ఆంధ్ర రత్న భవన్ పిసిసి కార్యాలయానికి రానున్న షర్మిల. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్న షర్మిల.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడంపై వైఎస్ షర్మిల స్పందించారు. తనపై నమ్మకం ఉంచిన ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం అందించేలా పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో, విధేయతతో పనిచేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. ఈ సందర్భంగా తాను మాణిక్యం ఠాగూర్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడితో కలిసి చేయి చేయి కలిపి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపారు. అంతేకాదు, మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు గారు, రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతలందరి మద్దతును తాను కోరుకుంటున్నానని… వారందరి సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను అందుకునేలా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఏపి పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల కు శుభాకాంక్షలు.. ఆల్ ది వెరీ బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. షర్మిల నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని అధిష్టానం ప్రకటించింది. నిన్న సోమవారం ఏపీ పీసీసీ గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన 24 గంటల్లోనే షర్మిలను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్లో చేరిన 15 రోజుల్లోనే ఏపీకాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు దక్కాయి. తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కూతురు వైఎస్ షర్మిలకు అవకాశం రావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా షర్మిల ప్రభావం అధికార, విపక్ష పార్టీలపై పడే అవకాశముందని భావిస్తున్నారు.