ఏలూరు,
పుట్టా మహేష్ యాదవ్(Putta Mahesh Yadav) పిసి కామెంట్స్…
చంద్రబాబు(Chandra Babu) గారు అప్పగించిన బాద్యతలు నేరవేరుస్తాను. నేను కర్ణాటకలో పుట్టి పెరిగాను. అనేక సేవా కార్యక్రమాలు విజయలక్ష్మి ట్రస్టు ద్వారా ఎప్పటినుంచో చేస్తూనే ఉన్నాను. గతంలో ఒక గ్రామాన్ని దత్త తీసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి పరిచాను. ఏలూరు నియోజకవర్గం లో ఉన్న అన్ని రకాల సమస్యలు నాకు తెలుసు. గత ఆరు నెలలుగా సమస్యలపై అధ్యయనం చేశాను. ప్రజలకు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదు ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం. తన సేవలను గుర్తించే చంద్రబాబు నాకు ఏలూరు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. అసమ్మతులు అసంతృప్తుల నేతలు అందరిని కలుస్తాను అందరితో చర్చించి విజయానికి సహకరించాలని కోరుతాను.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.