ఆసీస్ తో టీ20 మ్యాచ్ కోసం విశాఖ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు!

india squad

Advertisements

&NewLine;<p>ఈ నెల 23 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది&period; ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ కు ఏపీ తూర్పు తీర నగరం విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది&period; కాగా&comma; ఈ సిరీస్ కోసం పలువురు టీమిండియా ఆటగాళ్లు వైజాగ్ చేరుకున్నారు&period; యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్&comma; తిలక్ వర్మ&comma; ముఖేశ్ కుమార్&comma; అర్షదీప్ సింగ్&comma; జితేశ్&comma; రింకూ సింగ్ తదితరులు విశాఖలో అడుగుపెట్టారు&period; కాగా&comma; ఈ సిరీస్ లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది&period; వరల్డ్ కప్ లో ఆడిన టీమిండియాలోని చాలామంది ఆటగాళ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు&period; ఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్&comma; యజువేంద్ర చహల్&comma; సంజు శాంసన్&comma; వాషింగ్టన్ సుందర్&comma; రాహుల్ త్రిపాఠి&comma; ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లకు చాన్స్ లభిస్తుందని భావిస్తున్నారు&period; అంతేకాదు&comma; సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పరుగుల వెల్లువ సృష్టించిన రియాన్ పరాగ్ ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపికయ్యే అవకాశాలున్నాయి&period; కాగా&comma; ఈ సిరీస్ లో టీమిండియా కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తారని తెలుస్తోంది&period; టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ఈ వరల్డ్ కప్ తో ముగియనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.