ఆఖరి మెట్టుపై బోల్తాపడిన టీమిండియా..

Cricket

Advertisements

&NewLine;<p>గతేడాది భారత్ గడ్డపై జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకోవడం తెలిసిందే&period; ఆ మెగా టోర్నీలో ఫైనల్ వరకు అన్ని మ్యాచ్ లు గెలుస్తూ వచ్చిన టీమిండియా… ఆఖరి మెట్టుపై బోల్తాపడింది&period; ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది&period; ఇప్పుడు దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లోనూ అదే ఫలితం ఎదురైంది&period; బెనోనీలో జరిగిన ఫైనల్లో భారత్ కుర్రాళ్ల జట్టు 79 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది&period; లక్ష్యం పెద్దదేమీ కానప్పటికీ&comma; కుర్రాళ్లు ఒత్తిడికి లోనై వికెట్లు అప్పగించేశారు&period; 254 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 43&period;5 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలింది&period; ఆదర్శ్ సింగ్ 47&comma; హైదరాబాద్ ఆటగాడు మురుగన్ అభిషేక్ 42&comma; ముషీర్ ఖాన్ 22 పరుగులతో ఫర్వాలేదనిపించారు&period; టోర్నీలో పరుగుల వర్షం కురిపించిన కెప్టెన్ ఉదయ్ సహారన్ &lpar;8&rpar;&comma; సచిన్ దాస్ &lpar;9&rpar;&comma; అర్షిన్ కులకర్ణి &lpar;3&rpar; కీలకమైన ఫైనల్లో విఫలం కావడం జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది&period; ప్రియాన్షు మోలియా 9 పరుగులు చేయగా&comma; హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరవెల్లి అవనీశ్ రావు &lpar;0&rpar; డకౌట్ అయ్యాడు&period; ఆసీస్ బౌలర్లలో మాలీ బియర్డ్ మాన్ 3&comma; రాఫ్ మెక్ మిలన్ 3&comma; కల్లమ్ విల్డర్ 2&comma; చార్లీ ఆండర్సన్ 1&comma; టామ్ స్ట్రాకర్ 1 వికెట్ తీశారు&period; ఇప్పటికే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చాంపియన్స్&comma; టెస్ట్ చాంపియన్ షిప్ విజేత&comma; మహిళల వన్డే&comma; మహిళల టీ20 వరల్డ్ కప్ à°² విజేతగా ఉన్న ఆస్ట్రేలియా ఖాతాలో ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్ కూడా చేరింది&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;international-vande-bharat-trains&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.