శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు వెళ్లనున్నారు.

Advertisements

<p>శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు వెళ్లనున్నారు&period; ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు&period; భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు&period; రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు&comma; పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు&period; ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు&period; భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించిన 586 కోట్ల మాస్టర్ ప్లాన్‌లో భాగంగా&comma; మొదటి దశలో 351 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి&period; ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ సర్కార్&period; మొదటి దశలో గోదావరి ఘాట్ల అభివృద్ధి &comma; ఆలయ సముదాయ విస్తరణ&comma; ఇతర మౌలిక వసతుల కల్పన వంటి పనులు చేపడతారు&period; రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా తొలి దశ పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు&period; సీఎం భద్రాద్రి పర్యటనలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క&comma; మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&comma; తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రి వెంట ఉండనున్నారు&period; జిల్లా యంత్రాంగం భద్రాచలంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది&period; భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..