నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులకు – ఫారెస్ట్ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుంతలు తవ్వేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులకు – రైతులకు మధ్య తోపులాట జరిగింది. తమకు పట్టాలు ఉన్న భూమిలో ఫారెస్ట్ అధికారులు వచ్చి జెసిబితో తమ భూముల్లో కందకాలు తీస్తుడంతో రైతులు జెసిబి అద్దాలు పగులగొట్టారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న తమ భూముల్లో గుంతలు తవ్వడం సరైన పద్ధతి కాదని సాగుదారులు మండిపడుతున్నారు. సర్వే నెంబర్ 793 లోని భూములకు కొన్ని ఏళ్ళ క్రితం పట్టాలు ఇచ్చారని రైతులు తెలిపారు. కల్టివేషన్ అయి మూడు నాలుగు సంవత్సరాలు అయిందని, ఆర్ ఓఎఫ్ ఆర్ లో తమకు పట్టాలు ఉన్నాయన్నారు. పట్టాలు ఉన్న భూముల్లో ఎందుకు కందకాలు తీస్తున్నారని రైతులు అటవీ అధికారులను ప్రశ్నించారు. అడవి ప్రాంతంలో శాటిలైట్ ప్రకారం గుంతలు తీస్తున్న క్రమంలో ఒక మహిళ తమ భూమిలో ఎందుకు గుంతలు తీస్తున్నారని ఆరోపిస్తూ జెసిబిపై రాళ్లదాడికి పాల్పడినట్లు FRO వీరేష్ తెలిపారు. దీంతో ఆ మహిళపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
రైతులకు – ఫారెస్ట్ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం
96
previous post