లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య..
పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) వేళ బీఆర్ఎస్(BRS)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇవాళ సాయంత్రమే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు(K. Kesha Rao), హైదరాబాద్(Hyderabad) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) ప్రకటించగా.. రాత్రికి మరో బిగ్ షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)కు లేఖ రూపంలో తెలియజేసింది.
ఇది చదవండి: ఎమ్మెల్సీ ఓటు వినియోగించుకున్న మంత్రి జూపల్లి…
అంతేకాదు.. లేఖలో బీఆర్ఎస్పై సంచలన ఆరోపణలు చేసింది. అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ కుంభకోణం కేసులతో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిపోయిందని లేఖలో పేర్కొంది. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి