ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈనెల 28 నుంచి జనవరి 6వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ పాలనలో అధికారులే ఇంటి వద్దకు వెళ్లి దరఖాస్తులు తీసుకుంటారన్నారు. గూడెంలో 10 ఇళ్లు ఉన్నా అధికారులే వెళ్లి దరఖాస్తు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారు ఏ పథకానికి అర్హులో అధికారులు నిర్ణయిస్తారన్నారు. గ్రామసభలకు వచ్చే వారు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారని తెలిపారు. గతంలో కలెక్టర్ల సదస్సు అంటే కేవలం సీఎం చెప్పింది అధికారులు విని వెళ్లిపోయే వాళ్లని కానీ, ఈ సమావేశం అలా కాదు. ప్రభుత్వ పనితీరుపై కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయాలు తెలుసుకున్నామని పొంగులేటి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో రెండింటిని ఇప్పటికే అమలు చేశామన్నారు. ధరణి పోర్టల్ ద్వారా గత పాలకులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి రెగ్యులరైజేషన్ చేయించుకున్నారని మరి కొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయన్నారు వాటన్నింటి తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరణ – మంత్రి పొంగులేటి
72
previous post